Home /News /national /

HARYANA HOME MINISTER ANIL VIJ HAS SUSPENDED THREE POLICEMEN FOR NOT PERFORMING THEIR DUTIES PROPERLY SNR

Haryana: ఆ మంత్రి పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టాడు..ముగ్గురు ఉద్యోగాలు ఊస్ట్

 Photo Credit: Youtube

Photo Credit: Youtube

Haryana: హర్యానా హోంమంత్రి అనీల్ విజ్ పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. షహ్బాద్ పోలీస్‌ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి..పెండింగ్‌లో ఉన్న కేసులు ఎందుకు పరిష్కరించడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...
హర్యానా హోం మినిస్టర్ (Haryana home minister) అనీల్‌ విజ్ (Anil vij)మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ఉద్యోగులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తను తెలుసుకొని ఓ పోలీస్‌ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురుక్షేత్ర (Kurukshetra) జిల్లాలోని షహ్భాద్ (Shahabad) పోలీస్‌ స్టేషన్‌(Police station) కు వెళ్లారు హోంమంత్రి అనీల్‌ విజ్. అక్కడున్న పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. నమోదైన కేసులు, పెండింగ్‌ (Pending cases)లో ఉన్న కేసుల వివరాల్ని స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి డైరెక్ట్‌గా పోలీస్‌ స్టేషన్‌కు వస్తారని తెలియకపోవడంతో ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు సిబ్బంది. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఏం చేస్తున్నారు మీరంతా అంటూ నిప్పులు చెరిగారు. పోలీస్‌ శాఖపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో వదిలేయకుండా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక (ఎస్‌హెచ్‌వో)SHO,మరో సబ్‌ ఇన్స్‌పెక్టర్(Sub inspector),ఇంకో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌(Assistant sub inspector)ని సస్పెండ్ (Suspended)చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి ఆకస్మికంగా తనిఖీకి రావడం, దూకుడు ప్రదర్శించడంతో స్టేషన్‌ సిబ్బంది షాక్‌ అయ్యారు. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా వాళ్లకు ఇవ్వకుండా సస్పెండ్ నోటీసులు కూడా జారీ చేయమని ఉన్నతాధికారులను ఆదేశించారు హర్యానా హోంమంత్రి అనీల్‌ విజ్.

హోంమంత్రా..మజాకా..
హోంమంత్రి ఆకస్మిక పర్యాటనలో ఒకటి రెండు కాదు చాలా విషయాల్ని గమనించారు. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న నేరాల గురించి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. స్టేషన్‌కి వచ్చి బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్‌ని పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచారని మండిపడ్డారు. పోలీస్‌ సిబ్బంది ఇలా విధులు నిర్వహిస్తే పోలీస్‌శాఖపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు అనీల్‌ విజ్. అందుకే దీనికి బాధ్యులైన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశానంటూ మీడియాకు తెలిపారు. షహ్బాద్ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు పని చేయడం లేదని పెండింగ్‌ కేసుల్ని బట్టి చూస్తే అర్ధమవుతోందన్నారు. ఇంత నిధానంగా పని చేయడం తాను సహించలేనని..కేసుల పరిష్కారం విషయంలో చాలా వేగంగా పని చేయాలని..డిపార్ట్‌మెంట్‌కి గౌరవం తేవాలని హర్యానా హోంమంత్రి అధికారులకు ఆర్డర్ వేశారు.

పంజాబ్‌  ఘటన ప్రభావమేనా..
ప్రధాని పంజాబ్‌ పర్యటనలో సెక్యురిటీ లోపం బయటపడింది. దాని ప్రభావమే హర్యానా హోంమంత్రి అనీల్‌ విజ్‌ షడన్‌గా పోలీస్‌ స్టేషన్‌ని సందర్శించినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ సచివాలయంలో కూర్చొని శాఖలోని ఉద్యోగుల పనితీరును ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకునే మంత్రులు ఇలా స్వయంగా ఆకస్మిక తనిఖీల పేరుతో ఉద్యోగుల పనితీరును గమనించడం శుభపరిణామంగానే చూడాలి. హర్యానా హోంమినిస్టర్ అనీల్ విజ్ రూట్‌లోనే మిగిలిన రాష్ట్రాల్లోని హోంమంత్రులు అప్పుడప్పుడు పోలీస్‌ స్టేషన్‌లను సందర్శిస్తే చాలా కేసులు త్వరగా పరిష్కారమవుతాయి. పెండింగ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Haryana, Haryana police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు