ప్రైవేట్‌ స్కూళ్లలో ఎల్కేజీ, నర్సరీలు రద్దు... ప్రభుత్వ కీలక ఆదేశాలు

హాయిగా ఆడుకొనే పసివయసులోనే చిన్నారులు స్కూల్ బాట పట్టడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

news18-telugu
Updated: December 7, 2019, 9:56 AM IST
ప్రైవేట్‌ స్కూళ్లలో ఎల్కేజీ, నర్సరీలు రద్దు... ప్రభుత్వ కీలక ఆదేశాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు వీధికి ఒకటి ఉంటే... ప్రైవేట్ స్కూల్స్ మాత్రం మూడు నాలుగు కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రెండున్నరేళ్లకు స్కూల్స్‌లో జాయిన్ చేసుకోవడంతో చాలా మంది తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలంటూ మూడేళ్లకే పిల్లలతో అక్షరాలు దిద్దించేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రైవేట్ స్కూల్స్‌లో ఆ పప్పులేవి ఉడకవని హర్యాన ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రవైట్ విద్యా సంస్థల్లో ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

హాయిగా ఆడుకొనే పసివయసులోనే చిన్నారులు స్కూల్ బాట పట్టడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందుకే ఐదేళ్ల తర్వాత మాత్రమే పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేయాలని ఆదేశించారు. పిల్లలు ఆడటానికి మరియు మానసికంగా ఎదగడానికి తగినంత సమయం కావాలి. దానిని దృష్టిలో ఉంచుకుని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి తరగతులను మూసివేయాలని నిర్ణయించింది.

 

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>