మద్యం మీద కరోనా ‘ట్యాక్స్‌’... త్వరలో అమల్లోకి?

ప్రతీకాత్మక చిత్రం

మద్యం మీద ‘కరోనా సెస్’ విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగాలాండ్‌లో పెట్రోల్, డీజిల్ మీద కరోనా ట్యాక్స్ విధించారు.

  • Share this:
    కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ రావడంతో మద్యం ప్రియులకు నాలుక పీకేస్తోంది. మే 4 నుంచి కొన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరుస్తారని తెలియడంతో వారికి ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వచ్చింది. అయితే, ఆ కిక్కు కొంచెం దిగే వార్త. మద్యం మీద ‘కరోనా సెస్’ విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగాలాండ్‌లో పెట్రోల్, డీజిల్ మీద కరోనా ట్యాక్స్ విధించారు. ఇప్పుడు హర్యానాలో మద్యం మీద కరోనా సెస్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల హర్యానా రాష్ట్రం నెలకు రూ.6000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయని, ఇలా మద్యం మీద కరోనా సెస్ విధించడం ద్వారా వచ్చే ఆదాయంతో వాటిని మళ్లీ గాడిన పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.2 నుంచి రూ.20 వరకు కరోనా సెస్ విధించే అవకాశాలు ఉన్నట్టు దుష్యంత్ చౌతాలా చెప్పారు. డిప్యూటీ సీఎం చౌతాలా వద్దే ఎక్సైజ్, కామర్స్, ఇండస్ట్రీ శాఖలు ఉన్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: