హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హర్యానాలో కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి కాల్చివేత..

హర్యానాలో కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి కాల్చివేత..

వికాస్ చౌదరి హత్యపై హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని, చట్టాల పట్ల ఎవరికీ భయం లేకుండా పోయిందని అన్నారు.

    హర్యానా కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి గురువారం ఫరీదాబాద్‌లో హత్యకు గురయ్యారు. జిమ్ సెంటర్ నుంచి బయటకొచ్చి కారులో ఇంటికెళ్తున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం స్థానికులు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందారు. దుండగుడు 8-10రౌండ్ల కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరన్నది తెలియాల్సి ఉంది.

    వికాస్ చౌదరి హత్యపై హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని, చట్టాల పట్ల ఎవరికీ భయం లేకుండా పోయిందని అన్నారు.నిన్నటికి నిన్న లైంగిక వేధింపులకు ప్రతిఘటించిన ఓ మహిళను కత్తితో పొడిచారని గుర్తుచేశారు. వికాస్ చౌదరి హత్యపై తక్షణం విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    First published:

    Tags: Congress, Haryana

    ఉత్తమ కథలు