హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Haryana: మా జోలికొస్తే చేతులు నరికేస్తామంటూ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన రైతులు ఏం చేశారంటే..

Haryana: మా జోలికొస్తే చేతులు నరికేస్తామంటూ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన రైతులు ఏం చేశారంటే..

అరవింద్​ శర్మ (Photo: ANI/twitter)

అరవింద్​ శర్మ (Photo: ANI/twitter)

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాతల నిరసనలపై ఇటీవల కొందరు బీజేపీ (BJP) నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.

  కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాతల నిరసనలపై ఇటీవల కొందరు బీజేపీ (BJP) నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇపుడు హర్యానాలో రైతుల నుంచి తరచూ ఎదురవుతున్న నిరసనలు బీజేపీ (BJP) నేతలకు మంట పుట్టిస్తున్నాయి. రైతులపై ఆగ్రహంతో తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ ( Arvind Sharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ (Manish Grover‌ )ను రైతులు 8 గంటల పాటు నిర్బంధించిన ఘటనపై అరవింద్member శర్మ స్పందించారు. 'మనీష్ గ్రోవర్‌ను ఎవరైనా అడ్డుకుంటే.. వారి కళ్లు పీకేస్తా... చేతులు నరికేస్తా...' అంటూ హెచ్చరించారు. శనివారం (నవంబర్ 6) హర్యానాలోని ఓ పబ్లిక్ ఈవెంట్‌లో అరవింద్ శర్మ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల (making insensitive comments)పై అక్కడున్న బీజేపీ శ్రేణులు చప్పట్లు, కేకలతో హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

  8 గంటలపాటు నిర్భందం...

  హర్యానాలోని (Haryana) కిలోయ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ (Manish Grover‌)ను అక్కడి రైతులు 8 గంటల పాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ పర్యటనను లైవ్‌లో వీక్షించేందుకు గుడిలో ఏర్పాట్లు చేయగా... మనీష్ గ్రోవర్ సహా పలువురు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు మనీష్ గ్రోవర్‌తో పాటు అక్కడున్న బీజేపీ నేతలను ఆలయంలోనే నిర్బంధించారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన్ను నిర్బంధించామని ఆందోళనకారులు చెప్పారు. చివరకు ఆయన క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టామన్నారు. మనీష్ గ్రోవర్ మాత్రం తను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదన్నారు. తాను గుడిలో ఉన్న సమయంలో ఒకాయన లోపలికి వచ్చి రైతులకు అభివాదం చేయమన్నారని.. తాను అలాగే చేశానని చెప్పారు. అంతే తప్ప ఎవరికీ క్షమాపణ చెప్పలేదన్నారు.

  బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రాకి కూడా..

  మరో బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా ( MP Ram Chander Jangra)కి కూడా హర్యానా రైతుల నిరసన సెగ తాకిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిలో రైతులు లేరని, గ్రామాల నుంచి వచ్చిన తాగుబోతులని జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. పోలీసులు రైతులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు ఆందోళనకారులు ఎంపీ కారు అద్దాలను ధ్వంసంచేశారు. దాడిపై స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందని రామ్ చందర్ జాగ్రా అన్నారు. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Farmers Protest, Haryana

  ఉత్తమ కథలు