Home /News /national /

HARYANA BJP LEGISLATIVE PARTY MEETING TODAY TO FORMALLY ELECT ML KHATTAR AS ITS LEADER NK

నేడు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు... ఖట్టర్ ప్రమాణ స్వీకారం?

మనోహర్ లాల్ ఖట్టర్

మనోహర్ లాల్ ఖట్టర్

Haryana Government : హర్యానాలో అధికార బీజేపీ సహా ఏ పార్టీకీ మెజార్టీ దక్కకపోవడంతో... జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. ఏడుగురు స్వతంత్రులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

    Haryana Government : హర్యానాలో మొత్తానికి మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. ఇవాళ 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై... మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎన్నుకోనుంది. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి... మళ్లీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి బీజేపీ, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో... జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాలా సమావేశం అయిన తర్వాత రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం.. దుష్యంత్ సింగ్‌‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.

    90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది. అయినప్పటికీ స్వతంత్రుల మద్దతు బీజేపీకి కొనసాగనుంది.

    బీజేపీ - జేజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై నేడు గవర్నర్‌ను కలుస్తామని మనోహర్‌ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ - జేజేపీ కలసి నడవాలని నిర్ణయించుకున్నట్టు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ తెలిపారు.

     

    Pics : బొద్దందాలే ముద్దంటున్న గిహానీ క్యూట్ ఫొటోస్





    ఇవి కూడా చదవండి :

    Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?

    Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

    Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

    Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Haryana, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు