హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘మాయమైపోయాడమ్మ మనిషన్నవాడు..’.. లైవ్ ఎగ్జాంపుల్.. కావలంటే చదవండి..

‘మాయమైపోయాడమ్మ మనిషన్నవాడు..’.. లైవ్ ఎగ్జాంపుల్.. కావలంటే చదవండి..

బైటపడిన బాధితులు

బైటపడిన బాధితులు

Haryana: కొన్నేళ్ల క్రితం అంబాలలోని సదరు సోదరుల ఇంట్లో పిల్లల తండ్రి మరణించాడు. అప్పటి నుంచి బంధువులు ఎవ్వరు వారిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

  • Local18
  • Last Updated :
  • Haryana, India

ప్రస్తుతం సమాజంలో ఎవరు ఎవరిని పట్టించుకోలేని పరిస్థితులో ఉన్ననారు. కేవలం డబ్బు మాత్రమే టార్గెట్ గా అందరు పనులు చేస్తున్నారు. డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవం లేదా పట్టించుకొనే నాథుడు ఉండడు. ఇంట్లో, బంధువులలో డబ్బులు ఉంటే ఒకలాగ లేకపోతే మరోలాగా ట్రీట్ చేస్తుంటారు. సమాజంలో మానవసంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయని చెప్పుకొవచ్చు.

పక్కవాడిని కాదు కదా.. ఇంట్లో జన్మనిచ్చిన వారిని కూడా పట్టించుకోని ఎందరో కొడుకులు,కూతుళ్లు మన చుట్టునే ఉంటారు. ఇక.. కొన్ని చోట్ల బంధువులు కేవలం డబ్బులు ఉంటేనే కనీసం మాట్లాడటానికి ముందుకు వస్తారు. లేకుంటే అసలు పట్టించుకోరు. పైసా  మే పరమాత్మ అన్నట్లు.. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana)  అంబాలా లో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. 20 ఏళ్లుగా ఒక కుటుంబం తమ ఇంట్లో గడుపుతున్నారు. కనీసం బైటకు కూడా రాకుండా మలమూత్రాలను ఇంట్లోనే విసర్జిస్తు, అదే తింటు భరించలేని దుర్భర జీవితం గడిపాడు. దీనిపై స్థానికంగా ఉండే వందేభారత్ సొసైటీ సభ్యులకు తెలిసింది. వెంటనే ఆ సంస్థ ప్రతినిధి మింటూ మాల్వా తమ ప్రతినిధులతో కలసి వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ భరించలేని దుర్వాసనతో ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆ ఇంట్లో పూర్తిగా మలమూత్రాలు, కుళ్లిపోయిన పదార్థాలు దర్వనమిచ్చాయి.

అక్కడ మనుషులు కాదు కదా.. జంతువులు కూడా ఉండలేని పరిస్థితి. దీంతో వెంటనే వారిని బయటకు తీసుకొచ్చారు. దీనిపై ఆరాతీయగా.. ఆ ఇంట్లో డాక్టర్ ఉండేవాడని, అతనికి ముగ్గురు పిల్లలు.. అమన్ దీప్ , హిందు శర్మ, ఉండేవారని వీరిలో యువతి ఎం.ఎ, బి.ఎడ్ చేయగా, సోదరుడు ఇంటర్ పూర్తి చేశాడు. కొన్నేళ్ల క్రితం వీరి తండ్రి మరణించగా అప్పటి నుంచి వీరి బంధువులు వీరిని ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయారు. అంతే కాకుండా.. అమన్ దీప్.. రోజంతా బయట తిరుగుతు.. రోడ్డుపైన చెత్తకుప్పలపై పడేసిన పదార్థాలు తినేవాడు.

రాత్రి ఇంటికి వెళ్లి పడుకునేవాడు. ఈ క్రమంలో.. అతని బట్టలంతా మలమూత్రాలతో నిండిపోయింది. ఇక చుట్టుపక్కల వారు మాత్రం వీరు చాలా డబ్బులున్న వాళ్లని చెప్పడం కొసమేరుపు. ఇన్నేళ్లు వీరు.. కనీసం బైటకు రాకపోయిన బంధువులు, చుట్టుపక్కల వారు పట్టించుకొనకపోవడంపై సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులు, స్థానిక రాజకీయ నేతలు ఎవరికైన సమాచారం ఇచ్చిన బాగుండేదని మింటు మార్లే అన్నారు. ఈ క్రమంలో.. మనిషన్నవాడు మాయమైపోయడంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారందరిని ఆస్పత్రికి తరలించారు. దీన్ని బట్టి చూస్తే మానవ సంబంధాలు ఎంత దిగజారయో అర్థమవుతుంది. ఈ హృదయవిదారక ఘటన ఘటన వార్తలలో నిలిచింది.

First published:

Tags: Haryana, VIRAL NEWS

ఉత్తమ కథలు