• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • HARIDWAR KUMBH MELA 2021 INDIAN RAILWAYS TAKES VARIOUS STEPS FOR DEVOTEES SK KRS

Haridwar Kumbh Mela 2021: కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మకచిత్రం

Haridwar Kumbh Mela 2021: విశిష్ట ఆలయాలతో దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో జరిగే కుంభమేళాకు.. రైల్వే శాఖ కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త స్టేషన్ నిర్మాణం, డబ్లింగ్ చేపడుతోంది.

  • Share this:
    Haridwar Kumbh Mela 2021: కుంభమేళాను హిందువులు అత్యంత పవిత్రమైన క్రతువుగా భావిస్తారు. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ఆ మహా ఆధ్యాత్మిక వేడుకకు తరలివెళతారు. పవిత్ర గంగానదిలో మునిగి భక్తి పరవశులవుతారు. అంతటి ప్రాముఖ్యమున్న కుంభమేళా 2021లో ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరగనుంది.
    జనవరి 14న మకర సంక్రాంతి ఆగమనంతో కుంభమేళాకు అంకురార్పణ జరుగనుంది. ఏప్రిల్ 27 వరకు కొనసాగే ఈ క్రతువులో పుణ్య స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు.

    విశిష్ట ఆలయాలతో దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో జరిగే కుంభమేళాకు.. రైల్వే శాఖ కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త స్టేషన్ నిర్మాణం, డబ్లింగ్ చేపడుతోంది. కుంభమేళా కోసం రూ.660కోట్ల నిధులతో స్టేషన్లలో రైల్వే శాఖ ఇప్పటికే పనులను జోరుగా చేస్తోంది. ఇది కాక ఓ కొత్త రైల్వే స్టేషన్​ను రిషికేశ్​లో నిర్మించింది. ఇక భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనుంది.

    రూ.220 కోట్ల వ్యయంతో ఉత్తరాఖండ్​లో యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ నిర్మితమైంది. ఈ స్టేషన్ లో మొత్తం మూడు ప్లాట్​ఫామ్​లు ఉన్నాయి. అలాగే రెండు సిక్ లైన్లు, మరో రెండు వాషింగ్ లైన్లు పొందుపరిచారు. వాషింగ్ లైన్లలో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం విశేషం. అలాగే ఇప్పటి వరకు హరిద్వార్ నుంచి లక్సర్ కు సింగిల్ లైన్ ట్రాక్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం 27 కిలో మీటర్ల మేర చేపట్టిన డబ్లింగ్ పనులు ఈ నెల చివరి కల్లా పూర్తి కానున్నాయి. దీనికి రూ.346 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.

    ఇప్పటికే కుంభమేళా కోసం 25 రైళ్లు ఉండగా.. ఈశాన్య రైల్వే జోన్ 30 నుంచి 35 వరకు అదనంగా నడపనందని సమాచారం. సీనియర్ జోనల్ అధికారులు నిరంతరం వీటిని పర్యవేక్షిస్తారని జోన్ వర్గాలు చెప్పాయి. అలాగే ఉత్తర రైల్వే జోన్ కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. హరిద్వార్, రిషికేశ్, మటిచుర్, ఈథల్, పథ్రీ, జ్వాలాపూర్ రైల్వే స్టేషన్లలో నూతన ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. అదనపు ప్లాట్​ఫామ్​లు, షెల్టర్లు, తాగునీటి సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించనుంది. అలాగే 10 స్టేషన్లలో 340 అదనపు సీసీ కెమెరాలు, రైల్వే సమాచార వ్యవస్థను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: