హోమ్ /వార్తలు /జాతీయం /

హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు... అత్యవసర విచారణ కుదరదు: సుప్రీంకోర్టు

హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు... అత్యవసర విచారణ కుదరదు: సుప్రీంకోర్టు

హార్థిక్ పటేల్

హార్థిక్ పటేల్

ఏప్రిల్ 4న నామినేషన్ల చివరి తేదీ. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విచారణకు సమయం తీసుకుంటుండంతో ఈసారి ఎన్నికల్లో హార్థిక్ పోటీపై నీలినీడలు అలుముకున్నాయి.

    గుజరాత్ పటేళ్ల ఉద్యమ నేత హార్థిక పటేల్ రాజకీయ భవితవ్యం అయోమయోంలో పడింది. ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో హార్థిక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది. 2015కు సంబంధించిన ఓ దాడికేసులో హార్థిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు హార్థిక్. శిక్షపై స్టే విధించాలని కోరగా .. ఆ కోర్టు హార్థిక్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంత సుప్రీంకోర్టు మెట్లెక్కాడు హార్థిక్ పటేల్. దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం.. హార్థిక అంత తొందరెందుకంటూ ప్రశ్నించింది. అత్యవసరంగా అతని పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని పేర్కొంది. దీంతో హార్థిక్ పరిస్థితి గందరగోళంలో పడిపోయింది.


    ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, మూడేండ్లు జైలు శిక్ష పడిన ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దీనిపై స్టే విధించాలని హార్దిక్ పటేల్ కోర్టుకు విన్నించుకున్నాడు. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్‌ పటేల్ పై మొత్తం24 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. అందులో రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయని సర్కార్ కోర్టుకు తెలిపింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 4న నామినేషన్ల చివరి తేదీ. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విచారణకు సమయం తీసుకుంటుండంతో ఈసారి ఎన్నికల్లో హార్థిక్ పోటీపై నీలినీడలు అలుముకున్నాయి. రెండురోజుల్లో గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం రద్దు చేస్తే హార్ధిక్ పటేల్ ఎన్నికల బరిలో నిలుస్తాడు. లేదంటే అంతే సంగతులు. మరి ఏం జరుగుతుందో చూడాలి .

    First published:

    Tags: Gujarat, Hardik Patel, National News, Supreme Court

    ఉత్తమ కథలు