Lok Sabha Elections 2019 : ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొడుతూ గుజరాత్ నుంచీ దూసుకొస్తున్న యువ కెరటం హార్దిక్ పటేల్ చౌకీదార్ హ్యాష్‌ట్యాగ్‌పై తనదైన శైలిలో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్ అకౌంట్లలో తమ పేర్ల ముందు చౌకీదార్ పేరును పెట్టుకుంటున్నారు. తద్వారా తామంతా స్వచ్ఛమైన కాపలాదారులమనీ, నిజాయితీతో అవినీతికి తావులేని పాలన అందిస్తున్నామనే సంకేతాలు పంపుతున్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కి సారధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ఇప్పటికే సెటైర్ వేశారు. మోదీ నిజంగా కాపలాదారే అయితే... దేశాన్ని దోచుకుంటున్న దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఎందుకు ముగుస్తున్నాయని సెటైర్ వేశారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్ సైతం మోదీకి పంచ్ వేశారు.
ట్విట్టర్‌లో తన అకౌంట్ పేరును బేరోజ్‌గార్ (నిరుద్యోగి) హార్దిక్ పటేల్ అని మార్చుకున్నారు హార్దిక్ పటేల్. తద్వారా మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగిందనీ, ఆ బాధితుల్లో తానూ ఉన్నానంటూ సెటైరికల్ పంచ్ వేశారు హార్దిక్ పటేల్.
నరేంద్ర మోదీ చౌకీదార్ కాదు... చోర్ అని రాఫెల్ డీల్ విషయంలో... రాహుల్ గాంధీ పదే పదే అంటుండటంతో... దాన్ని తిప్పి కొడుతూ మోదీ మై బీ చౌకీదార్ (నేను కాపలాదారుణ్ని) నినాదాన్ని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. అది ట్రెండింగ్ అయ్యి... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దానిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం బాగా పెరిగిందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది కాంగ్రెస్ యువకులు తమ పేర్ల ముందు బేరోజ్ గార్ పేరును యాడ్ చేసుకుంటున్నారు. ఈ నినాదాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందా లేక దానంతట అదే స్ప్రెడ్ అవుతోందా అన్నది కాంగ్రెస్ స్పష్టం చెయ్యలేదు.
ఇవి కూడా చదవండి :
గెలిస్తే ఎమ్మెల్యే... ఓడితే ఎమ్మెల్సీ... అందుకే నారా లోకేష్ పదవికి రాజీనామా చెయ్యలేదా?
రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న పవన్.. ఎక్కడి నుంచి బరిలో దిగుతారు?
ఇక రైళ్ల ఆలస్యాలు ఉండవ్... 250 స్టేషన్ల దగ్గర త్వరలో రైల్వే ఫ్లై ఓవర్లు
టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారు... ఐదుగురు సిట్టింగ్‌లపై వేటు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Lok Sabha Elections 2019, Hardik Patel, Lok Sabha Election 2019, Narendra modi