HARDIK PATEL ASKS WHY CONG HATES HINDUS SO MUCH CITES GUJ LEADER RAM TEMPLE REMARK PVN
Hardik Patel : హిందువులంటే అంత ద్వేషం ఎందుకు..కాంగ్రెస్ పై హార్దిక్ పటేల్ ఫైర్
హార్దిక్ పటేల్ (ఫైల్ ఫోటో)
Hardik Patel Fires On Congress : ఇటీవలే కాంగ్రెస్ పార్టీ(Congress Party)గుడ్ బై చెప్పిన పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్(Hardik Patel)ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. రాజీనామా తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Hardik Patel Fires On Congress : ఇటీవలే కాంగ్రెస్ పార్టీ(Congress Party)గుడ్ బై చెప్పిన పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్(Hardik Patel)ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. రాజీనామా తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ తాజాగా హార్దిక్ పటేల్ ఆరోపించారు. రామ మందిర ఇటుకలపై కుక్క మూత్ర విసర్జన చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ కాంగ్రెస్ నేత అనడంతో హార్ధిక్ పటేల్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ భగవాన్ శ్రీరాముడిని ఎందుకు అంతగా ద్వేషిస్తుందని ప్రశ్నించారు. అసలు రాముడి విషయంలో కాంగ్రెస్‌కు ఉన్న శత్రుత్వం ఏమిటో చెప్పాలని హార్దిక్ పటేల్ డిమాండ్ చేశారు.
ఇంతగా కాంగ్రెస్ హిందువులను ఎందుకు ద్వేషిస్తోంది అంటూ ప్రశ్నించారు. ప్రజలు మనోభావాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని,హిందువుల మత విశ్వాసాలను దెబ్బతియడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంటూ హార్దిక్ పటేల్ విమర్శించారు. శతాబ్ధాల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నారని… అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రామాలయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారంటూ హార్థిక్ పటేల్ దుయ్యబట్టారు. గత వారం మే 18న హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తన మూడేళ్ల రాజకీయ జీవితం వృధా అయిపోయిందని హార్ధిక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఏ పనీ అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఇటీవల ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందినవారని ఆయన మీదున్న కోపాన్ని అంబానీ, అదానీలపై చూపడం తగదని హార్ధిక్ కాంగ్రెస్ కు సూచించారు. వ్యాపారవేత్తలైన అంబానీ, అదానీలను మాటికీ నిందించడం తగదని అన్నారు. వ్యాపారవేత్తలు కష్టపడి ఎదుగుతారని, ఉత్తినే వారిని విమర్శించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తరచుగా అదానీ, అంబానీలను విమర్శిస్తున్న నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.