గౌతం గంభీర్ అలాంటి వాడు కాదు...మద్దతుగా నిలిచిన భజ్జీ, లక్ష్మణ్...

గౌతమ్ కు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్లు కదిలారు. అంతే కాదు గౌతమ్ గంభీర్ పై వస్తున్న వార్తలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని, గౌతమ్ వ్యక్తిగతంగా చాలా హుందాగా ఉంటాడని, మహిళల పట్ల అంతలా దిగజారడని, ట్విట్టర్ వేదికగా గౌతమ్ కు మద్దతుగా నిలిచారు.

news18-telugu
Updated: May 10, 2019, 5:23 PM IST
గౌతం గంభీర్ అలాంటి వాడు కాదు...మద్దతుగా నిలిచిన భజ్జీ, లక్ష్మణ్...
గౌతం గంభీర్, హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్ ( ఫైల్ చిత్రం)
  • Share this:
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బాసటగా నిలిచేందుకు తోటి క్రికెటర్లు ముందుకు వచ్చారు. ఢిల్లీ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్ పై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. గంభీర్ తనను ఉద్దేశించి అసభ్య పదజాలంతో కూడి కరపత్రాలను ఢిల్లీలో పంచుతున్నారని ఆరోపించారు. దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. అయితే గౌతమ్ కు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్లు కదిలారు. అంతే కాదు గౌతమ్ గంభీర్ పై వస్తున్న వార్తలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని, గౌతమ్ వ్యక్తిగతంగా చాలా హుందాగా ఉంటాడని, మహిళల పట్ల అంతలా దిగజారడని, ట్విట్టర్ వేదికగా గౌతమ్ కు మద్దతుగా నిలిచారు. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ట్వీట్ లో ఎన్నికల్లో గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని, అయితే గంభీర్ మంచి వ్యక్తి అని మహిళల పట్ల అలాంటి పనులు చేయరని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరో వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం స్పందిస్తూ... గంభీర్ తనకు 20 సంవత్సరాల నుంచి తెలుసని, మహిళల పట్ల అతను ఎంత గౌరవంగా ఉంటారో తనకు తెలుసని తెలిపారు.

ఇదిలా ఉంటే తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్ అదే స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేస్తూ అతిషి ఎదురుదాడికి దిగుతున్నారు. దీనిపై గౌతమ్ సైతం గట్టిగానే స్పందిస్తూ.. అతిషి చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. అంతే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ అభ్యర్థి అతిషిలకు గౌతమ్ పరువునష్టం దావా నోటీసులు సైతం పంపించారు.
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>