Happy New year 2022: భారత దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ సందడి చేసింది. పిల్లలు పెద్దలు, మహిళలు అని తేడా లేకుండా ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. 2021కి గుడ్ బై చెప్పి 2022 కు వెల్ కమ్ చెప్పారు. 12 గంటల వరకు అంతా మెలుకవగా ఉండి.. సరిగ్గా 12 గంటలకు బాణాసంచాల కాల్పులు.. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు కొత్త సంవ్సతర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వివిధ పట్టణాల్ల్లో కఠిన ఆంక్షలు ఉండడంతో.. నిబంధనల మధ్యే వేడుకలు గ్రాండ్ గా సాగాయి. అంతా న్యూ ఇయర్ వేడుకలను జాలీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక యువత సంగతి చెప్పక్కర్లేదు. కుర్రకారు వేడుకలతో ఉర్రూతలూగుతోంది. బాణాసంచా పేలుస్తూ యువత సంబరాలు జరుపుకుంటోంది. కాగా, ఒమిక్రాన్ కారణంగా ఆంక్షల మధ్యే వేడుకలు జరుపుకుంటున్నారు.
పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర న్యూ ఇయర్ సందడి బాగా కనిపించింది. భక్తులు, సిక్కులు, సాధారణ ప్రజలు అంతా కలిపి గోల్డెన్ టెంపుల దగ్గర సందడి చేశారు. విద్యుత్ వెలుగులతో గోల్డెన్ టెంపుల్ మరింత
ధగధగలాడింది. సరిగ్గా 12 గంటలకు కాగానే ఒకరికి ఒకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ యువత హంగామా చేశారు..
#WATCH | A happy and brightening #NewYear2022 with fireworks visuals from Golden Temple in Amritsar, Punjab. pic.twitter.com/8bEKb1FwBZ
— ANI (@ANI) December 31, 2021
ఇక ఆర్థిక రాజధాని ముంబైలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకాయి. బాంద్రా వర్లి బీచు దరగ్గ హంగామా కనిపించింది. విద్యుత్ వెలుగుల మధ్య న్యూ ఇయర్ వేడుకలకు అంతగా గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. ముంబైలో తొలొ వేడుకలు అక్కడే ప్రారంభమయ్యాయి.
#WATCH | A Happy and a brightening #NewYear2022 with visuals of Bandra-Worli sea link in Mumbai pic.twitter.com/qya7609hiT
— ANI (@ANI) December 31, 2021
దేశ వ్యాపత్ంగా ఓ వైపు న్యూ ఇయర్ వేడుకలు సంబరంగా సాగుతుంటే.. మరోవైపు డ్రంక్ డ్రైవ్ పై పోలీసులు ఫోకస్ చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి.. వాహనాలను తనిఖీ చేశారు. మందు తాగి డ్రైవింగ్ చేసిన వారి తాట తీశారు..
Odisha: Night patrolling underway in Bhubaneswar as #NewYear2022 celebrations have been restricted including a ban on social gatherings till 2nd January pic.twitter.com/OqcxAXuAef
— ANI (@ANI) December 31, 2021
భారత దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. అర్థరాత్రి వరకు మెలుకువగానే ఉండి.. రోడ్లపై షికార్లు చేస్తూ.. డీజే సౌండ్లతో యువత సందడి చేశారు.. కరోనా భయాలను సైతం పక్కన పెట్టి .. యువత ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.
Tags: India news, National News, New Year 2022