మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. సహజంగా నూతన సంవత్సరం (New Year) వస్తుందంటే చాలు యువత ముందస్తు ప్రణాళికల్లో మునిగిపోతారు. సెలబ్రిటీ షోలు, మ్యూజిక్ బ్యాండ్లు, డీజేలు, విదేశీ కళాకారుల ప్రోగ్రామ్‌లు, పబ్‌లు, పార్టీల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ సారి కరోనా ప్రభావంతో ప్రభుత్వాలు వీటిపై ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది తమ ప్రణాళికలను మార్చుకున్నారు. ఎప్పటిలా కాకుండా విభిన్నంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. పవిత్ర స్థలాలు, సుందరమైన బీచ్‌లు, వన్యప్రాణుల అభయారణ్యాలు(wildlife sanctuaries), పచ్చని జాతీయ ఉద్యానవనాల(lush national park) మధ్య సెలెబ్రేషన్స్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ నూతన సంవత్సరానికి రెట్టింపు ఉత్సాహంతో స్వాగతం పలకాలంటే ఈ పర్యాటక ప్రదేశాల్లో వాలిపోండి.
గోవా
భారతదేశంలో ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో గోవా(Goa) ఒకటి. ఇక్కడ -ఉన్న బీచ్‌లు(Beaches) ప్రపంచవ్యాపంగా ప్రసిద్ది. ఇక్కడ న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకోవడానికి మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, బీచ్ అందాలను చూస్తే ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే. గోవా అన్ని వర్గాల ప్రజలు సందర్శించడానికి అనువైన ప్రదేశం. అందుకే చాలా మంది సెలెబ్రెటీలు సైతం న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవడానికి పయనమయ్యారు. ఇక్కడి బీచ్‌లలో లేజింగ్తో పాటు, యోగా, ధ్యానం కూడా చేయవచ్చు. టూరిస్టులు, అక్కడ స్టే చేయడానికి ట్రీహౌస్ సిల్కెన్ సాండ్స్(Treehouse Silken Sands), బెనౌలిమ్(Benaulim) వంటి అనేక ప్రముఖ హోటళ్లు అందుబాటుటో ఉన్నాయి.
మనేసర్
మీ కుటుంబంతో కలిసి నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికి మనేసర్ (Manesar )బెస్ట్ డెస్టినేషన్(Destination). సరస్సులకు ప్రసిద్ది చెందిన మానేసర్ కుటుంబ విహారయాత్రలకు, పార్టీలకు లేదా వివాహ వేడుకలకు గమ్యస్థానంగా పేర్కొనవచ్చు. మీ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ ఈవెంట్‌ను చిరస్మరణీయ అనుభవంగా మార్చుకోవడానికి మనేసర్‌ను ఎంచుకోండి. సరస్సులతో పాటు ఇక్కడి ప్రాచీన దేవాలయాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మాతా షీట్ల దేవి ఆలయం(Mata Sheetla Devi) ఒక ప్రసిద్ధ మత ప్రదేశంగా గుర్తింపు పొందింది. గురుగ్రామ్(Gurugram)కి సమీపంలో ఉండే మనేసర్ ఇటీవలి కాలంలో భాగా అభివృద్ది చెందడంతో ఇక్కడి జనాభా కూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడ స్టే చేయడానికి కంట్రీ క్లబ్ రిసార్ట్(Resort Country Club) అందుబాటులో ఉంది.
నైనిటాల్
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని- నైనిటాల్(Nainital) ఒక అందమైన హిల్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని కుమావున్ పచ్చని పర్వతాల మద్య ఉంటుంది. సుమారు 1938 మీటర్ల ఎత్తులో ఉన్న నైనిటాల్ అందమైన నైని సరస్సు చుట్టూ అభివృద్ధి చేయబడింది. వారాంతాల్లో విడిది కోసం దేశ రాజధాని ఢిల్లీ నుంచి అనేక మంది టూరిస్టులు నైనిటాల్ను సందర్శిస్తుంటారు. ఇక్కడ నివసించడానికి అనేక ప్రసిద్ధ హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పిలిభిత్ మహారాజా నివాసంగా ఉన్న 90 సంవత్సరాల పురాతన అందమైన భవనం- ‘ది నైని రిట్రీట్’లో మీరు స్టే చేయవచ్చు. బోట్ క్లబ్ హౌస్‌లోని స్టెల్లా యాచ్‌లో మల్టీ క్యూసైన్ రెస్టారెంట్, లైవ్ మ్యూజిక్ ఈవినింగ్స్, గైడెడ్ హెరిటేజ్ వాక్స్, కాంప్లిమెంటరీ రైడ్‌తో పాటు “గార్నీ హౌస్” వద్ద విలాసవంతమైన బఫే భోజనాన్ని ఆస్వాదించవచ్చు.
రిషికేశ్
ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది రిషికేశ్(Rishikesh). ఇక్కడ ధ్యాన సాధన కోసం అనేక యోగా ఆశ్రమాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని హిమాలయాల పర్వత ప్రాంతంలో రిషికేశ్ ప్రాంతాన్ని ‘గేర్వే టు ది గర్హ్వాల్ హిమాలయాలు’, ‘వరల్డ్ యోగా క్యాపిటల్’(Yoga Capital) అని పిలుస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన నదులలో ఒకటైన గంగా రిషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాల(Himalayas)లోని శివాలిక్ కొండలను వదిలి ఉత్తర భారతదేశ మైదానంలోకి ప్రవహిస్తుంది. అనేక పురాతన దేవాలయాలు రిషికేశ్ లోని గంగా నది ఒడ్డున ఉన్నాయి. శత్రుగ మందిరం, భరత్ మందిర్ (విష్ణువు అవతారం), లక్ష్మణ మందిరం, ఆది శంకరాచార్యులు స్థాపించిన పురాతన ఆలయాలు ఇక్కడే కొలువుతీరాయి. ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. లైవ్ ఇండియన్ ఫ్లూట్ మ్యూజిక్ ప్లే, హోలిస్టిక్ యోగా, ధ్యాన సెషన్లతో కూడిన బహుళ-వంటకాల గల రెస్టారెంట్లకు రిషికేశ్ ప్రసిద్ధి.
ధర్మశాల
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాలంటే ధర్మశాల(Dharamshala) బెస్ట్ డెస్టినేషన్. దేవదార్ అడవులు, అందమైన హిమాలయాలకు ధర్మశాల నెలవు. ఈ సహజమైన హిల్ స్టేషన్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.- ఇది హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని కాంగ్రా లోయ(Kangra valley)లో ఉంది. ఇది వ్యక్తుల స్వర్గధామం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, ప్రకృతిని పూర్తిస్థాయిలో అన్వేషించడానికి ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశంగా పేరొందింది. పర్యాటకులు ఇక్కడి మంచుతో కప్పబడిన ధౌలాధర్ శ్రేణుల ఒడిలో సేద తీరవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, New Year 2021, Tourism