హోమ్ /వార్తలు /జాతీయం /

Happy Ganesh Chaturthi : శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు...

Happy Ganesh Chaturthi : శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు...

Happy Ganesh Chaturthi : శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు... (image : Twitter - Akshata Naik)

Happy Ganesh Chaturthi : శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు... (image : Twitter - Akshata Naik)

Happy Ganesh Chaturthi 2019 : వీధి వీధినా, వాడవాడలా... గణేశ చతుర్థి వేడుకలు... అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి.

వినాయక చవితి వస్తే చాలు... ఇండియాతోపాటూ... ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు... అత్యంత సంప్రదాయబద్ధంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా... గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంటపాల్లో గణపతి ప్రతిమలను కొలువుదీర్చి... పూజలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలూ అంతా కలిసి... వినాయక చవితికి కొత్త బట్టలు వేసుకొని... పూజలు... వ్రతాలు చేస్తూ... ఫలాలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీధి వీధినా భారీ గణేశ ప్రతిమలు కొలువుతీరాయి. ఇక హైదరాబాద్‌... ఖైరతాబాద్‌లో 61 అడుగుల ద్వాదశ ఆదిత్య మహాగణపతిని దర్శించుకునేందుకు నిన్నటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా... ప్రభుత్వం, ఖైరతాబాద్ గణేశ పాలక మండలి పూర్తి ఏర్పాట్లు చేశాయి. గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ క్యూలైన్ల ఏర్పాట్లు చేశారు. అటు ముంబైలో లాల్ బాగ్ గణపతిని దర్శించుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతోపాటూ... ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

First published:

Tags: Ganesh Chaturthi​, Vinayaka Chavithi

ఉత్తమ కథలు