సామాన్య కుటుంబంలో జన్మించిన బాలుడు, సాధారణ RSS కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టిన యువకుడు.. నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని (Indian Prime minister) అయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జీవితపోరాటం అందరికీ స్ఫూర్తి మంత్రం అవుతుంది. గుజరాత్ (Gujarat)లోని వాద్‌నగర్‌లో పుట్టిన మోదీ, యవ్వనంలో ఇంటిని విడిచిపెట్టి, నెలల తరబడి దేశవ్యాప్తంగా సాధువులతో కలిసి జీవించారని చెబుతారు. ఆయనకు చిన్న వయస్సు నుంచి RSSతో అనుబంధం ఉంది. ఈ రోజు సెప్టెంబరు 17న 72వ జన్మదినాన్ని జరుపుకొంటున్న మోదీ జీవితంలో జరిగిన కీలక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
* కోవిడ్ సమయంలో భారతదేశం
2019లో భారతదేశం కోవిడ్ కోరల్లో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఈ సమయంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. ఇండియా సొంతంగా కోవిడ్ వ్యాక్సిన్లు రూపొందించింది. ప్రపంచ దేశాలకు ఇండియా నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయి. అనంతరం కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో తక్కువ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది.
* పాలనలో కీలక నిర్ణయాలు
2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోదీ ఆకర్షణ పని చేసింది. 543 సభ్యుల పార్లమెంటులో NDA 353 సీట్లు గెలుచుకుంది. ఆయన రెండో సారి ప్రధాని అయిన మొదటి నెలల్లోనే ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు, CAA ప్రవేశపెట్టడం, అయోధ్యలో రామ మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు మోఈ 2016 నవంబర్ 8న నోట్ల రద్దు, 2017 జులై 1న జీఎస్టీ వంటి విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు.
* జాతీయ భద్రత
2016 సెప్టెంబర్ సర్జికల్ స్ట్రైక్, 2019 ఫిబ్రవరి నాటి బాలాకోట్ వైమానిక దాడులు, 2020 మే నాటి గాల్వాన్ ఘర్షణలు భారతదేశ సైనిక చరిత్రలో మలుపులు. దేశ భద్రతకు భంగం వాటిల్లితే ఏ చర్యలకైనా వెనకాడబోమని ప్రధాని మోదీ ఆ సమయాల్లో స్పష్టం చేశారు. తీవ్రవాదం, అవినీతిని అంతం చేయడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని పిలుపునిచ్చారు. ఈ చర్యలతో గొప్ప జాతీయవాదిగా మోదీ గుర్తింపు పొందారు.
* గ్లోబల్ డిప్లమసీ
2014 నుంచి 2019 మధ్య, దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాలను నిర్మించడానికి మోదీ అనే పర్యటనలు చేపట్టారు. 2015లో పాకిస్థాన్‌లో పర్యటించి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశారు. ఇజ్రాయెల్ సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
* మోదీ రాజకీయ ప్రస్థానం ఇలా..
* ఎమర్జెన్సీ సమయంలో అండర్‌గ్రౌండ్‌కి: 1972లో అహ్మదాబాద్‌లో RSS విద్యార్థుల విభాగం ABVP యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో మోదీ సహకరించారు. రెండేళ్ల తర్వాత, అవినీతి వ్యతిరేక నవనిర్మాణ ఆందోళన ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎమర్జెన్సీ వ్యతిరేకతను సమన్వయం చేస్తున్న RSS సపోర్ట్ ఉన్న గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితికి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ సమయంలో RSSపై నిషేధం విధిండంతో మోదీ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. మారువేషంలో ప్రయాణించారు. నిషేధం తొలగిన తర్వాత ఆ సంస్థలోనే మోదీ ఉన్నత పదవులు పొందారు.
* రామ్ మందిర్ ఉద్యమం: 1987లో మోదీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. BJPలో చేరిన ఆయన అహ్మదాబాద్ సివిక్ ఎలక్షన్స్‌లో పార్టీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. అప్పుడు పార్టీ విజయం సాధించింది. దీంతో ఒక సంవత్సరంలోనే గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా పదోన్నతి పొందారు. 1990లో, అప్పటి BJP చీఫ్ ఎల్‌కె అద్వానీ చేపట్టిన సోమ్‌నాథ్- అయోధ్య రథయాత్ర, మురళీ మనోహర్ జోషి నిర్వహించిన కన్యాకుమారి- కాశ్మీర్ ఏక్తా యాత్రను విజయవంతంగా నిర్వహించిన మొదీ BJP జాతీయ ఎన్నికల కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
* గుజరాత్‌లో బలోపేతం: 1995లో గుజరాత్‌లో BJP అధికారంలోకి వచ్చిందిజ అప్పటి నుంచి రాష్ట్రం BJP కంచుకోటగా మారింది. మోదీ 1995లో BJP జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై.. 2001 వరకు ఆ పదవిలో కొనసాగారు. గుజరాత్ BJPలో శంకర్‌సిన్హ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మద్దతుదారుల మధ్య వివాదాలను అంతం చేసిన ఘనత మోదీకి దక్కుతుంది.
* గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక: 2001లో భుజ్ భూకంపం తరువాత, ఆరోగ్యం క్షీణించడం, ఇతర కారణాలతో గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థానాన్ని మోదీ భర్తీ చేశారు. అంతకుముందు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండేందుకు కూడా నిరాకరించారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సూచనతో.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2002 ఫిబ్రవరి 24న జరిగిన ఉప ఎన్నికలో ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో SCO దేశాలదే కీలక పాత్ర: ప్రధాని మోదీ
మోదీ హయాంలో గుజరాత్‌లో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించింది. 2002లో 182 సీట్లలో 127 గెలుచుకుంది. 2017లో 117, 2012లో 115 సాధించింది. గుజరాత్‌ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలుపుతూ మోదీ సాగించిన పాలన ప్రశంసలు అందుకుంది.
* గుజరాత్ అల్లర్లు: 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులు ప్రయాణిస్తున్న రైలును గోద్రాలో ఒక ముస్లిం గుంపు తగలబెట్టింది. డజన్ల కొద్దీ హిందూ యాత్రికులు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హింసలో వ్యక్తిగత ప్రమేయం ఉందంటూ మోదీపై కేసులు నమోదయ్యాయి. 2005లో అమెరికా అతనికి వీసాను కూడా నిరాకరించింది. కొన్నాళ్ల తర్వాత మోదీపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
* 2014లో చరిత్ర సృష్టించిన మోదీ
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి అద్వానీ నుంచి వ్యతిరేకత ఎదురైంది. కానీ ఎక్కువ మంది సపోర్ట్ ఇవ్వడంతో చివరికి మోదీనే ప్రధాని అభ్యర్థిగా నిలుచున్నారు. భారతదేశం అంతటా ‘అబ్ కీ బార్, మోడీ సర్కార్’ నినాదాలతో BJP ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో BJP సొంతంగా 282 స్థానాలను కైవసం చేసుకుంది. ఎప్పుడూ లేని స్థాయి విజయాన్ని దక్కించుకుంది. వడోదర, వారణాసి రెండు నియోజకవర్గాల్లో మోదీ విజయం సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Narendra Modi Birthday, National News, PM Narendra Modi