Home /News /national /

HAJJ 2021 MUKHTAR ABBAS NAQVI SAYS WILL HONOR SAUDI GOVERNMENT DECISION SU GH

Hajj 2021: సౌదీ నిర్ణయాన్ని గౌరవిస్తాం.. హజ్ యాత్రపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక ప్రకటన

మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

హజ్ యాత్రపై మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సౌదీ అరేబియా తీసుకునే నిర్ణయాన్ని భారత్ గౌరవిస్తుందని తెలిపారు.

హజ్ యాత్రపై మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సౌదీ అరేబియా తీసుకునే నిర్ణయాన్ని భారత్ గౌరవిస్తుందని తెలిపారు. సెంట్రల్ హజ్ కమిటీ, అన్ని రాష్ట్రాల హజ్ కమిటీలు యాత్రకు అనుమతి వస్తుందని భావించాయి. అయితే కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఇతర దేశాల యాత్రికులు ఈ సంవత్సరం హజ్‌కు హాజరు కావడం లేదు. దీంతో ఈ క్లిష్ట సమయంలో సౌదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని నఖ్వీ చెప్పారు. హజ్ యాత్ర నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, సౌదీ ప్రభుత్వ మార్గదర్శకాలపై ముంబైలోని హజ్ హౌజ్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై హజ్ కమిటీ సౌదీ ప్రభుత్వంతో చర్చిస్తోంది. యాత్రకు వెళ్లేవారిలో ఎంత మంది టీకాను తీసుకున్నారనే సమాచారాన్ని ఆ దేశం కోరింది. మన హజ్ కమిటీ వారికి సమాచారం అందిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. కానీ కొంతమంది కావాలనే టీకాలపై పుకార్లు, భయాలను వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ హజ్ కమిటీ, మౌలానా ఆజాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీకాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమానికి 'జాన్ హై తోహ్ జహాన్ హై' అని పేరు పెట్టాం’ అని వివరించారు.

కోవిడ్-19 టీకాలపై ఈ సంస్థలు చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో అన్ని వక్ఫ్ బోర్డులు, హజ్ కమిటీలు పాల్గొని, విజయవంతం చేయాలని నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజుతో కలిపి భారత్‌లో 25 కోట్లమందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ ముందుందని వివరించారు. మన దేశం నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తుందన్నారు.

భార్యను రేప్ చేసేందుకు ఫ్రెండ్స్‌కు పర్మిషన్ ఇచ్చిన భర్త.. ఏకంగా ఇంటికే పిలిచాడు.. అసలు ఏం జరిగిందంటే..

రెండుళ్లుగా సహజీవనం.. ఆ విషయంలో గొడవ ఎంత పనిచేసిందంటే..


సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించే హజ్ యాత్రకు భారత్ నుంచి ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది వెళ్తుంటారు. అయితే కోవిడ్ కేసుల నేపథ్యంలో సౌదీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు హజ్ యాత్రను రద్ధు చేశాయి. అత్యధిక ముస్లిం జనాభా ఉండే ఇండోనేషియా కూడా వరుసగా రెండో ఏడాది హజ్ యాత్రను రద్ధు చేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. మహమ్మారి నేపథ్యంలో భారత్ కూడా గత ఏడాది ఈ యాత్రను రద్ధు చేసింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Hajj, Saudi Arabia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు