Home /News /national /

HAJIPUR SERIAL MURDER CASE DEFENCE PROCEEDINGS WILL BE HEARD ON WEDNESDAY SK

హాజీపూర్ హత్యల కేసులో ముగిసిన ప్రాసిక్యూషన్ వాదనలు

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే కల్పన మృతదేహ ఆనవాళ్లను వెలికితీశారని.. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నిందితుడిగా అనుమానించవచ్చని పేర్కొన్నారు.

    తెలంగాణలో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. డిఫెన్స్ తరపున వాదనలను బుధవారానికి వాయిదా వేసింది నల్గొండ కోర్టు. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించాడు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే కల్పన మృతదేహ ఆనవాళ్లను వెలికితీశారని.. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నిందితుడిగా అనుమానించవచ్చని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాస్ అన్ని విధాలా మరణ శిక్షకు అర్హుడని కోర్టుకు తెలిపారు.

    యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రావణి, కల్పన, మనీషాను అత్యాచారం చేసి చంపేశాడు. మూడేళ్లలో ముగ్గురు బాలికలను కిరాతకంగా హత్య చేశాడు. మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో 600 మందికి పైగా సాక్షులను విచారించింది కోర్టు. ఈ కేసులో అతి త్వరలోనే తీర్పు వస్తుందని.. నిందితుడు శ్రీనివాస్‌కు శిక్షను ఖరారు చేస్తారని సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Hajipur murder case, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు