అగ్రరాజ్యం అమెరికా (America)లో ఉద్యోగం (Job) చేయాలనేది చాలా మంది యువతీ, యువకుల కల. ఐటీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఆర్థిక రంగాల్లోని వాళ్లు ఎక్కువగా యూఎస్‌లో జాబ్ చేయాలనుకుంటారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వచ్చే విదేశీయుల కోసం అక్కడి ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తుంది. మూడు సంవత్సరాల కాలపరిమితికి దీన్ని మంజూరు చేస్తారు. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ వీసాల ప్రక్రియ రేపటితో మొదలుకానుంది. దీని వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం.
* మార్చి 1 నుంచి ప్రారంభం
ఈ ఏడాది మంజూరు చేసే హెచ్1-బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం అవుతుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (UCIS) ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 17తో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. ఇలా రిజిస్టర్ అయిన ప్రతిఒక్కరికీ ఒక కన్ఫర్మేషన్ నంబర్ ఇస్తారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ పరిస్థితి తెలుసుకోవచ్చు.
విభిన్న రంగాల్లోని నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏటా పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలు ఇస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 65 వేల వీసాలు మంజూరు చేస్తుంది. దీంతో పాటు యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేద్దామనుకునే వారి కోసం మరో 20వేల హెచ్1-బీ వీసాలు అందిస్తుంది. అమెరికా ఏటా జారీ చేసే ఈ వీసాల్లో 70% పైగా భారతీయ అభ్యర్థులే దక్కించుకోవడం విశేషం.
* రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
https://myaccount.uscis.gov/users/sign_up అనే లింక్‌లోకి వెళ్లి myUSCIC అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి. దీని కోసం 10 డాలర్లు (సుమారు రూ.800) చెల్లించాలి. ఈ మొత్తం నాన్ రిఫండబుల్. సొంతంగా రిజిస్ట్రేషన్ చేద్దామనుకునే వారు రిజిస్ట్రెంట్ ఖాతాను ఉపయోగించాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచే ప్రారంభమైంది.
మిగిలిన వివరాల నమోదుకు మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. రిప్రసెంటిటీవ్స్ క్లెయింట్ ఖాతాలను యాడ్ చేసుకోవలన్నా మార్చి 1 తర్వాతే సాథ్యం. పేమెంట్ జరిగే వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతా పూర్తయిన తర్వాత సబ్మిట్ చేయాలి. వివరాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. ఫైనల్ లిస్ట్‌ను మార్చి 31న ప్రకటిస్తారు.
ఇందులో అనుమతి లభించిన వాళ్లు 90 రోజుల్లోగా హెచ్1-బీ వీసా దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తులో మీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ, యజమాని వివరాలు, గుర్తింపు సంఖ్య, పాస్‌పోర్ట్‌లో ఉన్నట్లుగా మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, పుట్టిన దేశం, పాస్‌పోర్ట్ నంబరు తదితర వివరాలు నమోదు చేయడంతో ప్రక్రియ పూర్తి అవుతుంది. ఏదిఏమైనా పూర్తి చేసే ముందు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్ చదివి దాని ప్రకారం పూర్తి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత అధికార వెబ్‌సైట్‌లో దానికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, H1B Visa, International news, National News, Visa