GYANVAPI MASJID CASE FRAGMENTED DEITY TEMPLE DEBRIS HINDU MOTIFS FIND MENTION IN SACKED GYANVAPI SURVEYOR REPORT GH SK
Exclusive: జ్ఞాన్వాపీ మసీదులో హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఆలయ శిథిలాలు.. సర్వే రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Gyanvapi Mosque: జ్ఞాన్వాపీ మసీదు ప్రాంగణంలో సర్వే చేసిన మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా సిద్దం చేసిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఛిన్నాభిన్నమైన దేవతల విగ్రహాలు, దేవాలయ శిథిలాలు, హిందూ నిర్మాణ శైలిలో చెక్కిన గోడలు వంటివి మసీదు లోపల కనిపించాయని తన రిపోర్టులో పేర్కొన్నారు.
Gyanvapi Mosque: జ్ఞాన్వాపీ మసీదు ప్రాంగణంలో సర్వే చేసిన మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా సిద్దం చేసిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఛిన్నాభిన్నమైన దేవతల విగ్రహాలు, దేవాలయ శిథిలాలు, హిందూ నిర్మాణ శైలిలో చెక్కిన గోడలు వంటివి మసీదు లోపల కనిపించాయని తన రిపోర్టులో పేర్కొన్నారు.
Exclusive: జ్ఞాన్వాపీ మసీదు (Gyanvapi masjid_ ప్రాంగణంలో ఏముంది? అక్కడ హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయా? దేవుళ్ల విగ్రహాలున్నాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసిన మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా (Ajay Mishra Report) సిద్దం చేసిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఛిన్నాభిన్నమైన దేవతల విగ్రహాలు, దేవాలయ శిథిలాలు, హిందూ నిర్మాణ శైలిలో చెక్కిన గోడలు వంటివి మసీదు లోపల కనిపించాయని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. సర్వే బృందం నుంచి కోర్టు ఆయన్ను తప్పించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసు గురువారం విచారణకు రానున్న నేపథ్యంలో, అజయ్ మిశ్రా సర్వే రిపోర్టులోని కీలక వివరాలను CNN-న్యూస్ 18 సంపాదించింది.
మసీదు ప్రాంగణం (Gyanvapi mosque) లో బయటపడిన శివలింగాన్ని (Shiling) సంరక్షించాలని, అలాగే మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలను ఎప్పటిలాగే అనుమతించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అజయ్ మిశ్రా రిపోర్టుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మసీదు ప్రాంగణంలో వారు ఏమేం చూశారు? లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నయన్నదానిపై ఆసక్తి నెలకొంది. అందరూ భావించినట్లుగానే మసీదులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. కమలం ఆకారంతో పాటు నాలుగు హిందూ విగ్రహాలు, పూజా సామాగ్రి అవశేషాలు, అలాగే శేషనాగ్ అనే పౌరాణిక సర్పం ఇమేజ్.. వంటివి మసీదులో ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
హిందూ పక్షం వాదనలకు బలం చేకూర్చేలా ఉన్న ఈ నివేదికను ప్రస్తావిస్తూ రేపు కోర్టులో వాదనలను వినిపించనున్నారు. అంతేకాదు ఈ పరిణామం అజయ్ మిశ్రాకు ఒక విజయంగా పరిగణించవచ్చు. ఎందుకంటే సర్వే కమిషనర్‌గా ఉన్న ఆయన.. లోపలి దృశ్యాలను మీడియాకు లీక్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కోర్టు ఆయన్ను సర్వే బృందం నుంచి తొలగించింది. ఈ నివేదికపై కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ నాగేంద్ర పాండే స్పందించారు. శివలింగం దొరికిన ప్రాంతాన్ని వెంటనే ట్రస్టుకు ఇవ్వాలని, పూజలు చేసేందుకు అనుమతించాలని తెలిపారు. ఆ సముదాయం మసీదు కాదని జ్ఞాన్వాపీ మందిరం అని చెప్పిన పాండే, మొత్తం ప్రదేశాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే చేసి తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు.
‘నేను కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నాను. ఈ ప్రాంతంలోని ఒక్కో అంగుళం ఒక్కో దేవాలయం వంటిది. తాజాగా గుర్తించిన వస్తువు శివలింగమా లేక నీటి ప్రవాహానికి అనువుగా ఉండే ఫౌంటైనా అనే విషయాన్ని కోర్టు గంటలోపు నిర్ణయించగలదు’ అని పాండే తెలిపారు. సర్వేలో కనుగొన్న శివలింగం పాత ఫౌంటెన్‌లో ఒక భాగమని ముస్లిం పక్షం వాదనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు, మసీదు తూర్పు వైపు పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని తాజా సర్వేకు ఆదేశించాలని ఈ కేసులో మహిళా పిటిషనర్లు వారణాసి కోర్టును ఆశ్రయించారు. తాజాగా గుర్తించిన శివలింగానికి మార్గం వేసేందుకు... ఆలయంలోని నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
KCR | Centre: కేసీఆర్ సంచలనం.. గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులు వద్దు.. రాష్ట్రాల ద్వారానే అన్ని పథకాలు..
జ్ఞానవాపీ ప్రాంగణం సమస్య 1991 నాటిది. మసీదు ప్రాంతంలో పూజలు చేయడానికి స్థానిక పూజారులు అనుమతి కోరుతూ వారణాసి కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. 17వ శతాబ్దంలో మొఘల్ రాజు ఔరంగజేబు ఆదేశాల మేరకు.. కాశీ విశ్వనాథుని మందిరంలోని కొంత భాగాన్ని తొలగించి జ్ఞాన్వాపీ మసీదును నిర్మించారని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్లలో ఒకరైన విజయ్ శంకర్ రస్తోగి, వారణాసికి చెందిన న్యాయవాది. 1991లో ఆయన దాఖలు చేసిన పిటిషన్లో.. ప్రస్తుత మసీదు ఉన్న ఆలయాన్ని సుమారు 2,050 సంవత్సరాల క్రితం మహారాజా విక్రమాదిత్య నిర్మించారని వాదించారు. జ్ఞాన్వాపీ మసీదును కూల్చివేయాలని, హిందువులకు మొత్తం భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని, అలాగే మసీదులో పూజలు నిర్వహించే హక్కును కల్పించాలని కోరారు. జ్ఞానవాపీ మసీదు పాక్షికంగా శిథిలమైన ఆలయంపై నిర్మించారని, అందువల్ల ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 వర్తించదని పిటిషనర్ వాదించారు. తాజా రిపోర్టు హిందూ వర్గానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. రేపు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.