GYANVAPI MASJID CASE COURT ORDERS TO SEAL AREA WHERE SHIVLING HAS BEEN FOUND PVN
Shivling Found In Masjid : జ్ఞాన్వాపి మసీదులో బయటపడ్డ 12 అడుగుల శివలింగం!
జ్ఞాన్వాపి మసీదు
Shivling Found In Gyanvapi Masjid : వారణాసి(Varanasi)లోని జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ కోర్టు ఆదేశించగా విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది. మే 17 నాటి విచారణకు సర్వేను పూర్తిచేయాలని, ఇందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోర్టు స్పష్టం చేయడంతో గత మూడు రోజుల నుంచి భారీ భద్రత నడుమ సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే.
Shivling Found In Gyanvapi Masjid : వారణాసి(Varanasi)లోని జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ కోర్టు ఆదేశించగా విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది. మే 17 నాటి విచారణకు సర్వేను పూర్తిచేయాలని, ఇందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోర్టు స్పష్టం చేయడంతో గత మూడు రోజుల నుంచి భారీ భద్రత నడుమ సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం మసీదులోని కొలనులో నీటిని పూర్తిగా తోడేయడంతో 12 అడుగుల శివలింగం(Shivling) బయటపడిందని హిందూ గ్రూప్ తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ చెప్పారు. జ్ఞాన్వాపి మసీదు( Gyanvapi Masjid) వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు.. అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలివ్వగా సోమవారం ఈ ప్రక్రియ ముగిసింది
ఇక,మసీదు ప్రాంగణంలోని కొలనుని నమాజ్ సందర్భంగా శుద్ధి చేసుకోడానికి వినియోగిస్తున్నారు అని లాయర్ శుభాష్ నందన్ చతుర్వేది అన్నారు. ఇస్లామిక్ "వాజూ" లేదా శుద్ధి కర్మ కోసం ఉపయోగించే కొలనను తప్పనిసరిగా సీలు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఆ కొలనుని ఉపయోగించకుండా చూడాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది.
మరోవైపు,జ్ఞాన్వాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. ఇక,మసీదులో బయటపడ్డ శివలింగం గురించి ముగ్గురు కమిషన్ సభ్యులు తయారు చేసే నివేదికను అడ్వకేట్ కమిషనర్ మంగళవారం కోర్టులో సమర్పించనున్నట్లు ప్రభుత్వం న్యాయవాది ఒకరు తెలిపారు.
మరోవైపు, జ్ఞాన్వాపీ మసీదు, శృంగార్ గౌరీ ప్రాంగణంలో సర్వే చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశించిన సివిల్ జడ్డ్ జస్టిస్ రవికుమార్ దివాకర్ గత వారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సివిల్ కేసును కీలకమైన అంశంగా మారడం వల్ల భయానక వాతావరణం నెలకొందన్నారు. దీని వల్ల తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. సర్వేకు నియమితులైన అడ్వకేట్ కమిషనర్‌ను మార్చాలని దాఖలైన పిటిషన్‌పై గత గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పిటిషన్‌ను జస్టిస్ రవికుమార్ తిరస్కరించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.