హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gyanvapi Mosque Case : జ్ణానవాపి మసీదు వివాదం..వారణాశి కోర్టులో హిందూ పిటిషనర్లకు పెద్ద విజయం!

Gyanvapi Mosque Case : జ్ణానవాపి మసీదు వివాదం..వారణాశి కోర్టులో హిందూ పిటిషనర్లకు పెద్ద విజయం!

జ్ఞానవాపి మసీదు

జ్ఞానవాపి మసీదు

Gyanvapi Mosque Case : దేశావ్యాప్తంగా చర్చనీయాంశమైన వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసు(Gyanvapi Mosque Case)లో వారణాసి కోర్టు(Varanasi Court)కీలక ఆదేశాలిచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gyanvapi Mosque Case : దేశావ్యాప్తంగా చర్చనీయాంశమైన వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసు(Gyanvapi Mosque Case)లో వారణాసి కోర్టు(Varanasi Court)కీలక ఆదేశాలిచ్చింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయం(kashi Vishwanath Temple) పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు(Hindu Women) వేసిన పిటిషన్‌ను విచారించేందుకు వారణాసిలోని కోర్టు(Varanasi Court) ఈరోజు అంగీకరించింది. మసీదు లోపల సర్వేకు దారితీసిన మహిళల పిటిషన్‌పై కోర్టు విచారణ కొనసాగుతుందని జిల్లా జడ్జి ఏకే విశ్వేషా తెలిపారు. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది.

కాగా,కోర్టు నిర్ణయం నేపథ్యంలో వారణాసిలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని వారణాసి కమిషనర్ ఏ సతీశ్ గణేశ్ తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. నగరంలో 2వేల మంది పోలీసు బలగాలను భద్రత కోసం నియమించినట్లు వారణాసి ఏసీపీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

జ్ణానవాపి మసీదు వివాదం ఇది

జ్ఞానవాపి మసీదు సముదాయంలో హిందూ దేవుళ్లు,దేవతల విగ్రహాలు ఉన్నాయని,జ్ఞానవాపి మసీదు వెనుకాలే ఉన్న హిందూ దేవుళ్ల విగ్రహాలకు ఏడాది మొత్తం పూజ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఐదుగురు హిందూ మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీదేవి, సీతా సాహు తదితరులు ఈ ఏడాది ప్రారంభంలో వారణాశి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు వీడియోగ్రఫీ సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు. మసీదులో చిత్రీకరణ నివేదికను సీల్డ్ కవర్‌లో వారణాసి కోర్టుకు సమర్పించారు, అయితే హిందూ పిటిషనర్లు కొన్ని గంటల తర్వాత వివరాలను విడుదల చేశారు. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి మసీదులోని బావిని సీల్ చేయాలని ఆదేశించారు.

అయితే శతాబ్దాల నాటి మసీదులో ఈ వీడియోగ్రఫీని జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మసీదులోని బావిలో కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. పూజించే స్థలాల చట్టం 1991 ప్రకారం .. వీడియోగ్రఫీ చట్టవిరుద్ధమని వాదించారు. ఆ తర్వాత ఈ కేసుని సుప్రీంకోర్టు వారణాశి డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్డుకి ట్రాన్స్ ఫర్ చేసింది. కాగా,ఇటువంటి పిటిషన్లు, మసీదులను సీలింగ్ చేయడం వల్ల మత సామరస్యానికి భంగం వాటిల్లుతుందని, ఇది దేశవ్యాప్తంగా మసీదులపై ప్రభావం చూపుతుందని మసీదు కమిటీ వాదించింది. జ్ణానవాపి మసీదు కమిటీ వారణాసి జిల్లా జడ్జి కోర్టు ముందు కూడా ఇలాంటి వాదనలు చేసింది, హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చట్టం తమ కేసును అడ్డుకోలేదని, స్వాతంత్ర్య దినం నాటికి మసీదు ప్రాంగణం వాస్తవానికి ఆలయమని కోర్టులో నిరూపించగలమని పేర్కొన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Gyanvapi Masjid case, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు