పేలుళ్ల కేసులో సినీ నటి అరెస్ట్.. 20కేజీల గన్ పౌడర్ స్వాధీనం..

గౌహతి గ్రెనేడ్ పేలుడు కేసును పోలీసులు 24గంటల్లోనే చేధించారు. మరోవైపు అరెస్ట్‌పై స్పందించిన ఉల్ఫా తీవ్రవాది రాజ్‌గురు.. తమ డిమాండ్లు నెరవేరనంతవరకు గ్రెనేడ్ పేలుడు లాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయని హెచ్చరించారు.

news18-telugu
Updated: May 17, 2019, 12:50 PM IST
పేలుళ్ల కేసులో సినీ నటి అరెస్ట్.. 20కేజీల గన్ పౌడర్ స్వాధీనం..
గౌహతిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం
news18-telugu
Updated: May 17, 2019, 12:50 PM IST
అసోంలోని గౌహతిలో బుధవారం చోటు చేసుకున్న గ్రెనేడ్ పేలుడు కేసును పోలీసులు చేధించారు. పేలుడుతో సంబంధం ఉన్న ఓ సినీ నటితో పాటు ఉల్ఫా(యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం) తీవ్రవాది ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన సినీ నటి పేరు జాహ్నవి సైకియా(40)గా సమాచారం. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న ఆమెను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు అరెస్టయిన ఉల్ఫా తీవ్రవాది పేరు ప్రణమోయ్ రాజ్‌గురుగా తెలుస్తోంది. 1986లో అతను ఉల్ఫా తీవ్రవాద సంస్థలో చేరినట్టు సమాచారం.

పేలుళ్లతో సంబంధం ఉన్న నిందితులు పంజాబరి ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నట్టు తమకు సమాచారం అందిందని.. ఆ వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించామని స్థానిక పోలీసులు తెలిపారు. తనిఖీల్లో రాజ్‌గురు, సైకియాలను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. వారి వద్ద నుంచి 9MM తుపాకీ, 25కాట్రిడ్జెస్, ఉల్ఫా ప్యాడ్స్, బాంబు తయారీ మెషీన్లు, 20కేజీల గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

గ్రెనేడ్‌ను ఎలా తరలించింది..? ఎవరి వద్ద నుంచి తీసుకొచ్చింది..? లాంటి వివరాలన్నీ విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. మరోవైపు అరెస్ట్‌పై స్పందించిన రాజ్‌గురు.. తమ డిమాండ్లు నెరవేరనంతవరకు గ్రెనేడ్ పేలుడు లాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయని హెచ్చరించారు. కాగా, గౌహతిలోని 'జూ' రోడ్‌లో బుధవారం చోటు చేసుకున్న పేలుడులో 12మంది తీవ్రంగా గాయపడ్డారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...