సినిమా ఛాన్సులు ఇస్తానని మోసం చేసిన హీరోయిన్!

news18
Updated: June 6, 2018, 2:50 PM IST
సినిమా ఛాన్సులు ఇస్తానని మోసం చేసిన హీరోయిన్!
Image: Yogen Shah
  • News18
  • Last Updated: June 6, 2018, 2:50 PM IST
  • Share this:
సినిమా అవకాశాల  పేరిట మోసం చేస్తున్న కేసులో  సినీ నటుల పై కేసు నమోదు అయ్యింది. బాలీవుడ్‌ కపుల్‌ గుర్మీత్‌ చౌదరి-డెబీనా బెనర్జీలు ఛాన్స్  లు  పేరుతో మోసం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్  చేశాడు.

రవిబాబు తీసిన కామెడీ మూవీ  'అమ్మాయిలు - అబ్బాయిలు' సినిమాలో హీరోయిన్ గా నటించిన డెబినా బెనర్జీ ఆ తర్వాత హిందీ సీరియల్స్ లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత టీవీ యాక్టర్  గుర్మీత్ చౌదరీ ని ఆమె పెళ్ళి  చేసుకుంది.

తాజాగా ఆమె తన భర్తతో కలిసి చేసిన మోసం బయటకు వచ్చింది. హిందీ మూవీల్లో  అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి డెబ్లీనా మోసం చేసిందని ఓ వ్యక్తి రాజస్థాన్ లోని నొఖా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  తనును  ఒక్కడినే కాదని..చాలా  మందిని ఇలాగే  డెబ్లీనా మోసం చేసిందని సదరు వ్యక్తి  పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

దీంతో పోలీసులు డెబ్లీనా, గుర్మీత్ జంటకు నోటీసులు పంపించారు. వారిద్దరూ తన నుంచి రూ. 11 లక్షలు తీసుకున్నారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పుడు వరకు వాళ్ళు స్పందించలేదని.. తనను మోసం చేశారని బాధితుడు ఆరోపించాడు. ఇక తనపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న గుర్మీత్, సదరు బాధితుడికి వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ వ్యవహారంలో తమ ప్రమేయం లేదంటూ ఆ దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Published by: Sunil Kumar Jammula
First published: June 5, 2018, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading