గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల్లో పాత చట్టాల అమలుకై ఎంపీల మద్దతు కోరేందుకు.. ఢిల్లీ బాట పట్టిన గల్ఫ్ జేఏసీ..

గల్ఫ్ జేఏసీ బృందం

ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేకార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది.

  • Share this:
    ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేకార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన గల్ఫ్ జెఏసి  బృందం శనివారం మంచిర్యాలలో ఢిల్లీ వెళ్లే రైలులో బయలుదేరారు. ఈ సందర్భంగా గల్ఫ్ జెఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం సర్కులర్లు జారీ చేసి ఆరు నెలలు కావస్తున్నదని గుర్తు చేశారు. ఈ సర్కులర్లను రద్దు చేయాలనీ, వాటి స్థానంలో పాత వేతనాలను కొనసాగించాలని ఎన్నో విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుండి స్పందన లేదని ఆయన వాపోయారు.

    ఈనెల 8న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్బంగా  తాము అన్ని రాష్ట్రాల ఎంపీలను 8, 9 తేదీలలో కలిసి గల్ఫ్ కార్మికుల వేతన సమస్యను వివరించి వినతిపత్రాలు అందజేస్తామని గుగ్గిళ్ల రవిగౌడ్ అన్నారు. వేతన తగ్గింపు సర్కులర్ల ప్రభావం మెల్లమెల్లగా రాబోయే కాలంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని గల్ఫ్ జెఏసి రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. అందరినీ ఒకే గాటన కట్టి నెల జీతం 200 డాలర్లకు (రూ.15 వేలకు) తగ్గిస్తూ ఏకపక్షంగా సర్కులర్లు జారీ చేయడం వలన గల్ఫ్ కార్మికులు మరింత పేదరికంలోకి జారిపోనున్నారని ఆయన అన్నారు. సర్కులర్లను రద్దుచేసి, పాత వేతనాలను కొనసాగించాలని కోరారు.

    GULF JAC, members, going, Delhi, support, minimum wage Law,Members of Parliament, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జేఏసీ, పాతచట్టాలు, కొత్త చట్టాలు, కనీస వేతన సవరణ చట్టం, గల్ఫ్ దేశాలు
    ఢిల్లీ వెళ్తున్న గల్ఫ్ జేఏసీ బృందం

    ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

    ఓమాన్, యుఎఇ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కనీస వేతనాలను సవరించాలని భారతదేశాన్ని కోరలేదని, రిక్రూటింగ్ ఏజెన్సీలు, విదేశీ కంపెనీ యాజమాన్యాలకు లబ్ది చేకూర్చేలా కొత్త చట్టాలు ఉన్నాయనీ, వాటి వల్ల భారత పౌరులకు ఏమాత్రం ఉపయోగం లేదని గల్ఫ్ జెఏసి ఖతార్ ప్రతినిధి తోట ధర్మేందర్ అన్నారు. ఖతార్ ప్రభుత్వం అన్ని దేశాల కార్మికులకు 1,000 రియాళ్ళ కనీస వేతనం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చట్టం చేసిందని, భారత ప్రభుత్వం తమ కార్మికులను 728 రియాళ్లకే (200 డాలర్లు) పంపిస్తామని చెప్పడం శోచనీయమని ఆయన అన్నారు. గల్ఫ్ జెఏసీ బృందంలో మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్,  బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి ఉన్నారు. గల్ఫ్ జేఏసీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పత్రికా ప్రకటనను మంద భీంరెడ్డి విడుదల చేశారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు
    Published by:Hasaan Kandula
    First published: