Home /News /national /

GUJARATH SPECIAL COURT ORDERS PROBE ON DRUGS RELATED TO MUNDRA PORT LINKS WITH VIJAYAWADA FULL DETAILS HERE PRN GH

Mundra Port: హెరాయిన్‌ కేసుతో ముంద్రా-అదానీ పోర్టు యాజమాన్యానికి సంబంధం ఉందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడకు (Vijayawada) చెందిన ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో గుజరాత్‌లోని (Gujarat) ముంద్రా పోర్టుకు (Mundra Port) చేరిన రెండు కంటెయినర్లు వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

విజయవాడ (Vijayawada)కు చెందిన ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో గుజరాత్‌ (Gujarath) లోని ముంద్రా పోర్టుకు (Mundra Port) చేరిన రెండు కంటెయినర్లు వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అప్గానిస్థాన్‌ (Afghanisthan) నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌కు (India) వచ్చిన ఈ రెండు కంటెయినర్లలో 2,990 కేజీల హెరాయిన్‌ పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సెప్టెంబర్‌ 16న స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ 2,990 కేజీల హెరాయిన్‌ దిగుమతి ద్వారా ముంద్రా అదానీ పోర్టు, దాని యాజమాన్యం ఏమైనా లబ్ధి పొందిందా? అనే విషయాలపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. గుజారాత్‌లోని నార్కొటిక్‌ డ్రగ్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ ప్రత్యేక కోర్టు డీఆర్‌ఐకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అలాంటి కంటెయినర్లను విదేశాల్లో ఎలా స్కానింగ్‌ చేస్తారు, ఎలా పరీక్షిస్తారు, ముంద్రా పోర్టులో ఎలా చేస్తారనే విషయాలపై కూడా దర్యాప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హెరాయిన్‌ స్వాధీనం వెనుక అనేక కోణాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. విజయవాడకు సమీపంలోనే చెన్నై పోర్టుగా ఉండగా ఎందుకు దీన్ని ఎంతో దూరంలో ఉన్న గుజరాత్‌లోని ముంద్రా అదానీ పోర్టులో రిజిస్టర్‌ చేసి ఇక్కడికి దాన్ని రప్పించారో కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది చదవండి: డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా ఏపీ..? దీని వెనుకున్న కింగ్ పిన్ ఎవరు..?


ముంద్రా రేవుకు సెప్టెంబర్‌ 16న చేరిన రెండు కంటెయినర్లను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఇందులో టాల్క్‌ పౌడర్‌ లేదా సెమీ-ప్రాసెస్డ్‌ టాల్క్ స్టోన్స్‌ ఉన్నట్టుగా ప్రకటించారు. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు నుంచి ఇవి ఇండియాకు చేరాయి. హస్సన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ నుంచి విజయవాడకు చెందిన ఆషీ ట్రేడింగ్‌ సంస్థ దీన్ని దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆషీ ట్రేడింగ్‌ యజమాని సహ ఎనిమిది మందిని ఇప్పటికే డీఆర్‌ఐ అరెస్టు చేసింది.

ఇది చదవండి: ఏపీ నుంచి ఇవి వెళ్తే అమెరికా వాళ్లకు పండగే... లొట్టలేసుకొని తింటారు..!


గత రెండేళ్లుగా గుజరాత్‌లోని కచ్‌ జిల్లా తీర ప్రాంతం.. పాకిస్థాన్‌, అప్గానిస్థాన్‌ నుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌, దిగుమతికి స్థావరంగా మారిందని సెప్టెంబర్‌ 26న జారీ చేసిన ఆదేశంలో కోర్టు పేర్కొంది. ఇక్కడి నుంచి కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోందని అభిప్రాయపడింది. ఇతర సంస్థలు ఏవైనా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ దీన్ని డీఆర్‌ఐ కూడా అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

  • మరో వైపు పోర్టు ఆపరేటర్‌ పాత్ర కేవలం పోర్టు నిర్వహణకే పరిమితమవుతుందని అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఎపీఎస్‌ఈజడ్‌) తరపున అదానీ గ్రూప్‌ ఒక ప్రకటన జారీ చేసింది. షిప్పింగ్‌ సంస్థలకు ఎపీఎస్‌ఈజడ్‌ కేవలం సేవలు మాత్రమే అందిస్తుందని స్పష్టం చేసింది. అంతే కాదు ముంద్రాలోనే కాదు ఏ ఇతర పోర్టుల్లోనూ మిలియన్ల టన్నుల కార్గోను తీసుకెళ్లే కంటెయినర్లను పరిశీలించే అధికారం తమకు ఉండదని వెల్లడించింది.

Published by:Purna Chandra
First published:

Tags: Andhra Pradesh, Drugs, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు