పెళ్లికాని కూతురు ఫోన్ వాడితే... ఇక ఆ తండ్రికి వాయింపే

1. ఎట్టిపరిస్థితుల్లో థర్డ్ పార్టీ ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ ఉపయోగించకూడదు. మీ ఫోన్‌కు వచ్చిన ఛార్జర్‌నే ఛార్జింగ్ కోసం ఉపయోగించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)

పెద్దల నిర్ణయం ఆ ఊరి వారందరికీ రాజ్యాంగంలాంటింది.

 • Share this:
  ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ కనిపించని వారుండరు. చదువుకున్న పిల్లల కానుంచి 60ఏళ్ల ముసలివాళ్ల వరకు ఎవరి చేతిలో చూసినే సెల్ ఫోన్ కనిపిస్తుంది. అంతలా సెల్ ఫోన్ ప్రతీ ఒకరిరి దగ్గరగా అయిపోయింది. అయితే గుజరాత్‌లోని ఓ గ్రామం వారి వరకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఊరిలో పంచాయితీలు... రచ్చబండలమీద చర్చలుఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ విధంగానే గుజరాత్ లోని బాణస్కాంత గ్రామంలోని పెద్దలో సెల్ ఫోన్‌కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాని అమ్మాయి ఎవరైనా మొబైల్ ఫోన్ వాడితే, అతని తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు జరిమానాగా వసూలు చేయాలని  గ్రామ పెద్దలు నిర్ణయించారు.

  సమాజంలో మహిళలు సగభాగమన్నది కేవలం మాటలకు మాత్రమే పరిమితమని, వారిపై చిన్నచూపు కొనసాగుతూనే ఉందనడానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన గుజరాత్ బాణస్కాంత గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడి పెద్దలు సమావేశమై, ఠాకూర్ వర్గంలోని పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. పెద్దల నిర్ణయం ఆ ఊరి వారందరికీ రాజ్యాంగంలాంటింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఫోనే వాడితే, ఆమె తండ్రి నుంచి రూ. 1.50 లక్షలు జరిమానాగా వసూలు చేయాలని పెద్దలు నిర్ణయించారు.

  దీంతోపాటు... గ్రామ పెద్దలు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివాహ సమయాల్లో డీజేలు వద్దని, బాణసంచా కాల్చడాన్ని ఆపివేయాలని నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా వారి పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అది నేరంగానే పరిగణించాలని తీర్మానించారు. అయితే గ్రామ పెద్దలకొన్ని నిర్ణయాలు మంచిగానే ఉన్నా.. ఫోన్ వాడకం విషయంలో తీసుకున్న నిర్ణయం మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
  Published by:Sulthana Begum Shaik
  First published: