హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: కొంప ముంచిన బంధువులు చెప్పిన సమాచారం.. కుప్పకూలిన మహిళ.. అసలేం జరిగిందంటే..?

OMG: కొంప ముంచిన బంధువులు చెప్పిన సమాచారం.. కుప్పకూలిన మహిళ.. అసలేం జరిగిందంటే..?

భావన, అరుణ్, (ఫైల్)

భావన, అరుణ్, (ఫైల్)

Gujarat: వివాహిత తన ఇంట్లో పనులు చేసుకుంటుంది. తన భర్త రాకకోసం ఎదురు చూస్తుంది. వీరి పిల్లలు కూడా నాన్న ఎప్పుడు వస్తాడో అని వేచీ చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తరపు బంధువులు ఫోన్ చేశారు.

  • Local18
  • Last Updated :
  • Gujarat, India

కొన్ని సార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నుంచి బైటకు వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం లేకుండా పోయింది. కొందరు రోడ్డు మీద వెళ్లేటప్పుడు ప్రమాదాల బారినపడుతున్నారు. మన మార్గంలో ఎంత జాగ్రత్తగా వెళ్లిన అవతలివారు కేర్ లేస్ గా వాహనాలు డ్రైవ్ చేసి ఇతరుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. కొన్ని సార్లు రోడ్డు మీద పోయేటప్పుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తుంటారు. వీరి వలన కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.

మరికొన్ని సార్లు రోడ్ల మీద ఇసుక ఉండటం, రోడ్లు పాడైపోయి ఉండటం వలన కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. కారు అదుపు తప్పడం, బైక్ స్కిడ్ అయి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలలో కొన్ని సార్లు చిన్నపాటి ప్రమాదాలు జరిగితే, మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు... గుజరాత్ లో (Gujarat) షాకింగ్ ఘటన జరిగింది. తన భర్తకు ప్రమాదం జరిగిందనే సమాచారంతో అతని భార్య కూడా షాక్ కు గురై కుప్పకూలీపడిపోయింది. నవ్‌సారి నగరంలో ఈ విషాదరక సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా.. ఖేర్గామ్‌లో తోరవన్‌వెరా అనే గ్రామం ఉంది. అక్కడ అరుణ్ గవిట్ తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇతగాడి భార్య భావన ఆ గ్రామానికి సర్పంచ్ కూడా. అయితే.. అరుణ్ బైక్ మీద బైటకు వెళ్లాడు.

అప్పుడు అనుకొకుండా బైక్ స్కిడ్ అయి కిందపడ్డాడు. వెంటనే అతని తలకు గాయమై, తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు.. అంబులెన్స్ కు కాల్ చేశారు. రోడ్డు ప్రమాదాంలో తీవ్రంగా గాయపడిన అరుణ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

వెంటనే. బాధితుడి, బంధువులకు సమాచారం అందించారు. వీరు కాస్త.. మృతుడు అరుణ్ భార్య భావన గవిత్ కు చెప్పారు. ఈ సమాచారం వినగానే.. సదరు మహిళ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఎంతసేపటికి లేవలేదు. దీంతో వెంటనే ఆమెను అక్కడ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు గుండెపోటుతో మరణించిందని తెలిపారు. భర్త చనిపోయిన అరగంటలోనే భార్య కూడా చనిపోవడంతో ఆ కుంటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కాగా, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మరణంతో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రుల రక్షణ కూడా లేకుండా అనాథలుగా మారిపోయారు. ఈ క్రమంలో ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, పిల్లలను చక్కగా చూసుకునే వారని సమాచారం. పాపం.. తల్లిదండ్రుల కోసం పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

First published:

Tags: Gujarat, Heart Attack, Road accident

ఉత్తమ కథలు