కరోనాతో మరో ఎంపీ మృతి.. ప్రధాని మోదీ సంతాపం

Corona Death: ఇటీవలే కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే తాజాగా గుజరాత్ కు చెందిన బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్(Gujarat Rajya Sabha MP Abhay Bharadwaj) కరోనాతో కన్నుమూశారు.

news18-telugu
Updated: December 2, 2020, 6:35 AM IST
కరోనాతో మరో ఎంపీ మృతి.. ప్రధాని మోదీ సంతాపం
అభయ్ భరద్వాజ్(ఫైల్ ఫొటో)
  • Share this:
ప్రపంచానికి పట్టిన కరోనా పీడ ఇంకా వీడడం లేదు. కేసుల సంఖ్య తగ్గుతున్నా.. ఏ దేశంలోనూ కేసుల నమోదు, మరణాలు మాత్రం ఆగడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ ఈ వైరస్ భూతం వదలడం లేదు. ఇటీవలే కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే తాజాగా గుజరాత్ కు చెందిన బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాది జూలైలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టులో ఆయనకు కరోనా సోకడంతో రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందారు.

అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న భరద్వాజ్ మంగళవారం ప్రాణాలు విడిచారు.ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. మాయదారి మహమ్మారి కరోనా వైరస్ వెలుగుచూసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి ఈ మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కరోనావైరస్ ముక్కు ద్వారా మనుషుల మెదడులోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. జర్మనీలోని చరైట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన ఈ అధ్యయనాన్ని నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధన ఫలితాలు కోవిడ్-19 రోగుల్లో నాడీ సంబంధ అనారోగ్యాలను గుర్తించడానికి సహాయపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీటి ఆధారంగా రోగ నిర్ధారణ, వైరస్ సంక్రమణను నివారించే చర్యలు తీసుకోవచ్చు. ‘SARS-CoV-2 లేదా Covid-19 వైరస్ శ్వాసకోశ వ్యవస్థతో పాటు, కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం వంటి నాడీ సంబంధిత అనారోగ్యాలకు దారితీస్తుంది’ అని అధ్యయనం పేర్కొంది.
Published by: Nikhil Kumar S
First published: December 2, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading