గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడంపై బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఏ తృతీయ పక్షాన్ని ఎన్నడూ అంగీకరించలేదని తెలిపారు. గుజరాత్ బీజేపీ(BJP) పూర్తిగా ఐక్యంగా ఉందని, ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో(Gujarat) మూడో పార్టీ అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిందని చాలామంది అంటున్నారని.. అయితే గతంలోనే ఇలా జరిగిందని అమిత్ షా చెప్పారు. గతంలో కేశూభాయ్ పటేల్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని.. శంకర్ సింగ్ వాఘేలా కూడా సొంత పార్టీతో బరిలోకి దిగారని గుర్తు చేశారు. అయితే గుజరాత్ ప్రజలు ఆ పార్టీలను పట్టించుకోలేదని.. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆప్ విషయంలోనూ ఇదే జరుగుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలకు ముందు న్యూస్ 18 నిర్వహించిన 'గుజరాత్ అధివేషన్'లో పాల్గొన్న అమిత్ షా.. నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
జీవన ప్రమాణాలను పెంచడానికి లేదా మౌలిక సదుపాయాలను కల్పించడానికి మద్దతు ఇవ్వడం ఉచితాలు ప్రొత్సహించడం కాదని అమిత్ షా అన్నారు. గుజరాత్లో కొందరు అనేక హామీలు ఇస్తున్నారన్న అమిత్ షా.. రాష్ట్ర బడ్జెట్ రూ. 2,42,000 కోట్లుగా ఉంటే వారి ఇచ్చే హామీల విలువ రూ. 3,52,000 కోట్లుగా ఉందని గుర్తు చేశారు. కొందరు ఇచ్చే వాగ్దానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ప్రాథమిక విద్యను ఉచితంగా చేస్తామని కొందరు అంటున్నారని.. ఇది 1960 నుండి ఉచితమే అని అన్నారు. విద్యుత్ అనేది ఉచితం కాదని.. ఏ బిల్లు కూడా ఉచితం కాదని అన్నారు.
తాము పేదలకు చేయూత ఇచ్చే విధంగా చేస్తామని..కానీ వాటికి ఉచితాలకు ఎంతో తేడా ఉందని అమిత్ షా వివరించారు. పేదలను ప్రభావితం చేసిన కోవిడ్ తర్వాత మందగమనం కారణంగా మహమ్మారి మధ్య తాము ఉచిత రేషన్ ఇచ్చామని.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ వర్గమైనా నష్టపోతే వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అయితే ఇది ఉచితాలు కాదని అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచడం, మౌలిక సదుపాయాలు ఇవ్వడం ముఖ్యమని చెప్పుకొచ్చారు.
Pm Modi: జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ ..అధికారిక ప్రకటన రిలీజ్..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ భేటీ అయ్యే ఛాన్స్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న నిర్వహించబడుతుంది. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగియనుంది. గుజరాత్లో అక్టోబర్ 10న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం 4.9 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. అందులో 4.04 లక్షల మంది దివ్యాంగులు. 9.8 లక్షలకు పైగా 80-ప్లస్ సీనియర్ సిటిజన్లు. 4.61 లక్షల మంది మొదటి సారి ఓటర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.