హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అరుదైన సంఘటన.. యాత్రికులతో 10 రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ప్రెగ్నెంట్ శునకం.. ఎక్కడంటే..

అరుదైన సంఘటన.. యాత్రికులతో 10 రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ప్రెగ్నెంట్ శునకం.. ఎక్కడంటే..

పరిక్రమ చేపట్టిన యాత్రికులు

పరిక్రమ చేపట్టిన యాత్రికులు

Gujarat: ఓంకారేశ్వర్ నుంచి ఒక శునకం యాత్రికులతో కలిసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. వారు ఎక్కడికి వెళ్లిన అక్కడికి వెళ్తు.. వారు పెట్టింది తింటూ.. విశ్రాంతి తీసుకుంటుంది. పదిరోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది.

  • Local18
  • Last Updated :
  • Gujarat, India

శునకాన్ని ప్రేమకు, విశ్వాసానికి గుర్తుగా భావిస్తుంటారు. అవి తమ యజమాని ఎక్కడికి వెళ్లిన అక్కడికి వెళ్తుంటాయి. ఎల్లప్పులు తమ యజమానిని కంటకనిపెట్టుకుని ఉంటాయి. కుక్కలు ఇంట్లో ఉంటే ఇతరులు.. ఇంట్లోకి రావడానికి భయపడిపోతుంటారు. కొత్తవారిని అడుగు కూడా పెట్టనివ్వవు. అయితే.. కొన్నిసార్లు తమ యజమాని వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే, అతను వచ్చే వరకు అన్నం కూడా పెట్టుకోవు. ఇంతటి విశ్వాసాన్ని కుక్కలు కల్గి ఉంటాయి. అలాంటి ఒక శునకం.. యాత్రికులతో కలిసి పదిరోజులుగా ప్రదక్షిణలు చేస్తుంది.

మహారాష్ట్రలోని దోబులిలో నివసించే యోగేష్ లేలే ఒంటరిగా నర్మదా నదికి ప్రదక్షిణలు చేస్తున్నాడు. వారు ఓంకారేశ్వర్ నుండి నర్మదా ప్రదక్షిణలు ప్రారంభించారు. అతనికి ఓ అరుదైన సంఘటన జరిగింది. ప్రదక్షిణలో ఒక కుక్క వారితో కలిసి వచ్చింది.

మహారాష్ట్రలోని ఖప్పర్మల్ నుండి కుత్రిలో వచ్చి చేరిన శునకం..

యోగేష్‌భాయ్ లేలే మహారాష్ట్రలోని ఖపర్మల్‌కు చేరుకున్నప్పుడు, నర్మదా ప్రదక్షిణల కోసం ఒక కుక్క యాత్రికులతో పాటు వచ్చి చేరింది. పరిక్రమవాసి కుక్క తనకు ఒక దైవంలా అది తనను కాపాడటానికి వచ్చినట్లు భావించాడు. నర్మదా ప్రదక్షిణకు బయలు దేరినప్పుడు అతనితో పాటే.. కుక్కకూడా  ప్రదక్షిణలతో  చేస్తు వారిని అనుకరించింది. అంతే కాకుండా.. వారు పెట్టింది తింటూ.. రాత్రి ఎక్కడ ఆగితే అక్కడ ఆగేది.   రాత్రిపూట బస చేసి పగలు తెల్లవారగానే తిరిగి యాత్రికులతో..  ప్రదక్షిణల చేసేదని యాత్రికులు చెబుతున్నారు. ఈ ష్కూటరి పరిక్రమ నివాసితులతో కలిసి భరూచ్ జిల్లాలోని జుక్నియా తాలూకాలోని రాజ్‌పర్ది సమీపంలోని ఖప్పర్ మాల్ నుండి భలోడ్‌కు చేరుకుంది.

యాత్రికులను ఫాలో అవుతూ ప్రదక్షిణలు చేస్తున్న శునకం..

ఈ విషయమై పరిక్రమ వాసులు మాట్లాడుతూ.. గర్భవతిగా ఉన్నప్పటికీ కుక్క చాలా దూరం ప్రయాణించి పరిక్రమలో చేరిందని భావిస్తున్నాం. ప్రదక్షిణలు చేసేవారు ఆమెను చూసే వరకు కుక్క ప్రదక్షిణలు చేసేవారి కంటే ముందుగా నడుస్తుంది. ఆ తర్వాత ప్రదక్షిణ చేసేవారి కోసం వేచి ఉండదు.ఈ మూగ జంతువును నర్మదాపై భక్తి లేదా విశ్వాసం అని పిలవండి లేదా ఆమెకు కూడా నర్మదా ప్రదక్షిణ పిచ్చి ఉన్నట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఒక శునకం.. ఈ విధంగా..   భక్తితో నడవటం  చూసి నర్మదా పరిక్రమ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

First published:

Tags: Gujarat, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు