Gujarat Updates: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే నేత ఎవరు? ఆ ఇద్దరిపైనే రాహుల్ ఆశలు?

రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

Gujarat Latest News | గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపేందుకు సరైన దిశానిర్దేశం చేసే నేత కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అహ్మద్ పటేల్ లేని లోటును పూడ్చేందుకు మరో ఇద్దరు కీలక నేతల మీద ఆశలు పెట్టుకుంది. వారిద్దరు ఎవరో ఈ స్టోరీలో చూడండి.

 • Share this:
  గుజరాత్‌లో (Gujarat) అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్టానం భారీ నిర్ణయం తీసుకుంది. విజయ్ రుపానీని (Vijay Rupani) దించేసి ఆయన స్థానంలో పాటీదార్ సామాజికవర్గానికి చెందిన నేత, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రపటేల్‌ను (Bhupendra Patel) కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆయన ఈ రోజు గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్ణాటక , మధ్యప్రదేశ్, గోవా నుంచి ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తన ప్రమాణస్వీకారానికి ముందు భూపేంద్రపటేల్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌ను కలిశారు. ప్రభుత్వంలో పట్టున్న నేతగా గుర్తింపు పొందిన నితిన్ పటేల్‌ను కలసి తనకు సహకారం అందించాలని కోరారు. భూపేంద్రపటేల్ కూడా తనకు పాత కుటుంబ స్నేహితుడేనని నితిన్ పటేల్ కామెంట్ చేశారు. దీంతో గుజరాత్‌లో కొత్త సీఎంకు రూట్ క్లియర్ అయిపోయింది. విజయ్ రుపానీ మీద ఉన్న వ్యతిరేకత అనేది 2022 ఎన్నికల్లో ప్రభావం చూపకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు ఆయన్ను తొలగించారు. రాష్ట్రంలో గట్టి పట్టున్న పటేల్ సామాజికవర్గానికే అవకాశం ఇచ్చారు.

  2017లో గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగైన ప్రతిభ చూపింది. 40 శాతం అదనపు ఓట్ షేర్ సాధించింది. బీజేపీ ఓట్ల శాతానికి చాలా దగ్గర వరకు వచ్చింది. జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ లాంటి నేతలు హస్తం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. పాటీదార్ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా బీజేపీని ఇరుకున పెట్టిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు చేశారు.

  రాహుల్ గాంధీ కూడా 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. రాష్ట్రంలో అన్ని ప్రముఖసంఘాలను కలిశారు. కానీ, ఆ తర్వాత సీన్ మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 2019లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటేల్ సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.


  వీటన్నిటికంటే ముఖ్యంగా ఓ వ్యక్తి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన అహ్మద్ పటేల్. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్‌ను ఓడించడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. సామదానబేదదండోపాయాలను ప్రయోగించింది. కానీ, అన్నిటినీ ఢీకొట్టి, ఎత్తుకు పై ఎత్తులు వేసి అహ్మద్ పటేల్ రాజ్యసభలో అడుగు పెట్టారు.

  హైదరాబాద్ లో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి.. ఆ తేదీ నుంచి ఆఫీస్ లకు రావాల్సిందే.. !


  అహ్మద్ పటేల్ లేని లోటును పూడ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు భారీగానే ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా స్పెషల్ ఫోకస్ చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ 2024 లోక్‌సభ ఎన్నికలకు కీలకం కానుంది. అందుకే ఓ డైనమిక్ లీడర్‌కు గుజరాత్ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది.

  టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో భార్య కన్నుమూత..


  భూపేష్ బాగల్ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ మీద మంచి పట్టు ఉంది. వ్యవస్థాగతంగా ఏం చేయాలో ఆలోచన ఉంది. సీఎంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వీటన్నిటికంటే లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తుంటారు. కానీ, సీఎం ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడం కొంచెం కష్టమే.

  నిద్రపోయే ముందు బోర్లా పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం..


  ఇక మరో పేరు కూడా రాహుల్ గాంధీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. యంగ్ లీడర్, రాజస్థాన్‌లో పీసీసీ చీఫ్‌గా మంచి పనితీరు, అందరూ గుర్తు పట్టే ముఖం. పొరుగు రాష్ట్రం. ఇవన్నీ కలసి సచిన్ పైలెట్ వైపు రాహుల్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: