హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat, Himachal Pradesh Assembly Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచేదెవరు? ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!

Gujarat, Himachal Pradesh Assembly Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచేదెవరు? ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat, Himachal Pradesh Assembly Election Results: రిజల్ట్స్ ట్రెండ్ ఉదయం 9 గంటలకల్లా బయటకు వస్తుంది.  మధ్యాహ్నానికి రెండు రాష్ట్రాల్లో ఫలితాలపై పరిస్థితిపై పూర్తి స్పష్టత రావచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ (Gujarat Assembly Election Results), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh Assembly Election Results)ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. గురువారం ఓట్లను లెక్కించి.. ఫలితాలను వెల్లడిస్తారు.  గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.   ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎం యంత్రాలను  తెరిచి.. ఓట్లను కౌంట్ చేస్తారు.  రిజల్ట్స్ ట్రెండ్ ఉదయం 9 గంటలకల్లా బయటకు వస్తుంది.  మధ్యాహ్నానికి రెండు రాష్ట్రాల్లో ఫలితాలపై పరిస్థితిపై పూర్తి స్పష్టత రావచ్చు.

గుజరాత్‌(Gujarat)లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. తొలి దశలో 63.3 శాతం, రెండో దశలో 64.65 శాతం పోలింగ్ నమోదయింది.  గుజరాత్‌లో  ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరం. బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం.. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా గెలిచిన సీపీఎం రికార్డును ఆ పార్టీ సమం చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్  కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అంచనా వేశాయి. గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని మెజారిటీ సర్వేలు తెలిపాయి. గుజరాత్‌లో  గతంలో  బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండగా.. ఈసారి ఆమాద్మీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్‌లో గెలిచినట్లుగానే ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తామని ధీమాగా ఉంది. కానీ ఆ పార్టీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

మరోవైపు హిమాచల్‌(Himachal Pradesh)లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబరు 12న ఒకే దశలో అక్కడ పోలింగ్ జరిగింది.  74శాతం ఓటింగ్ నమోదయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 35. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది.  ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అందువల్ల ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.  ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం.. చరిత్రను తిరగరాసినట్లే..!

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు..  5 రాష్ట్రాల్లోని 1 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. ఈ ఫలితాలు కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.

First published:

Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, Himachal Pradesh, Himachal Pradesh Elections 2022

ఉత్తమ కథలు