• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • GUJARAT HIGH COURT ORDERS HOSPITAL TO COLLECT AND STORE SPERM OF MAN DYING FROM COVID ON PLEA BY WIFE SSR

Gujarat High Court: కరోనా సోకి చావుకు దగ్గరైన భర్త వీర్యంతో తల్లి కావాలనుకున్న భార్య.. కోర్టు ఆదేశాలివి..

ప్రతీకాత్మక చిత్రం

మాతృత్వం అనేది ఒక వరం అంటుంటారు. ‘అమ్మ’ అని పిలిపించుకోవాలని ఏ స్త్రీకి ఉండదు చెప్పండి. అలా తన భర్త బిడ్డకు తల్లి అవ్వాలని ఆశించిన ఓ వివాహితకు కరోనా అడ్డం తగిలింది. ఆమె భర్తను కరోనా మహమ్మారి మృత్యువు రూపంలో కబళించేందుకు కాచుకు కూర్చుని ఉంది.

  • Share this:
    అహ్మదాబాద్: మాతృత్వం అనేది ఒక వరం అంటుంటారు. ‘అమ్మ’ అని పిలిపించుకోవాలని ఏ స్త్రీకి ఉండదు చెప్పండి. అలా తన భర్త బిడ్డకు తల్లి అవ్వాలని ఆశించిన ఓ వివాహితకు కరోనా అడ్డం తగిలింది. ఆమె భర్తను కరోనా మహమ్మారి మృత్యువు రూపంలో కబళించేందుకు కాచుకు కూర్చుని ఉంది. వైద్యులు కూడా ఆమె భర్త బతికే అవకాశాలు తక్కువేనని తేల్చి చెప్పారు. తన భర్త బిడ్డకు తల్లి కావాలని భావించిన ఆ వివాహిత కోర్టును ఆశ్రయించి తన భర్త వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్ విధానంలో బిడ్డకు తల్లి కావాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రి వైద్యులకు ఈ విషయం చెప్పగా అందుకు నిరాకరించారు. దీంతో.. ఆ మహిళ కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించింది. తన భర్త పట్ల ఆ మహిళ చూపుతున్న ప్రేమకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఆమె భర్త వీర్యాన్ని సేకరించేందుకు ఆసుపత్రికి అనుమతినిచ్చింది.

    గుజరాత్ హైకోర్టు తాజా తీర్పుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం గుజరాత్ హైకోర్టు ఈ వివాహిత పిటిషన్‌పై ఆదేశాలిచ్చింది. వడోదరాలోని స్టెర్లింగ్ హాస్పిటల్‌కు ఆమె భర్త వీర్యాన్ని సేకరించి.. భద్రపరచాలని ఆదేశించింది. కోర్టు తీర్పు పట్ల పిటిషన్ దాఖలు చేసిన వివాహిత హర్షం వ్యక్తం చేసింది.

    ఈ పిటిషన్ దాఖలు చేసిన మహిళ స్పందిస్తూ.. తన భర్త మే 10, 2021 నుంచి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా విషమించిందని తెలిపింది. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ECMO సపోర్ట్‌తో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని.. మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పినట్టు పేర్కొంది.
    Published by:Sambasiva Reddy
    First published: