గుజరాత్‌కి తుఫాను గండం... అంతటా రెడ్ అలర్ట్...

Cyclone Vayu : గుజరాత్‌లో వాయు తుఫాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే అక్కడ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు... అలర్ట్‌గా ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 8:08 AM IST
గుజరాత్‌కి తుఫాను గండం... అంతటా రెడ్ అలర్ట్...
వాయు తుఫాను గమనం (Image : Twitter / Rahul Gandhi)
  • Share this:
సరిగ్గా నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చే సమయంలో... అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు తుఫానుగా మారి... గుజరాత్ వైపు దూసుకెళ్తోంది. ఈ తుఫాను వల్ల తెలుగు రాష్టాలకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యమవుతుంటే, తుఫాను ప్రభావం ఎలా ఉంటుందోనని గుజరాత్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాగంగా తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు... 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడంతో... ప్రభుత్వం అలర్టైంది. ఇప్పటికే కచ్, సౌరాష్ట్ర ప్రాంతం నుంచీ 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ ప్రాంతాలపై శుక్రవారం వరకూ... తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం NDRF, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జాగ్రత్తగా ఉండాలనీ, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

Loading...
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తమ కార్యకర్తలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కోరారు.వాయు తుఫాను మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోర్‌బందర్, డమన్ డయ్యూలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయిు. ప్రస్తుతం వెరావల్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాను... మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ అలలు అత్యంత ఎత్తున లేస్తున్నాయి. ఆ ప్రాంతంలో... యుద్ధ నౌకలు, విమానాల్ని సిద్ధం చేశారు. పోర్‌బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను నేటి అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నారు. అక్కడ స్కూళ్లకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. 70 రైళ్లు రద్దుచేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

కాంగ్రెస్‌కి మరో దెబ్బ... ఆ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారా... సాగుతున్న చర్చలు?

భారీగా నకిలీ విత్తనాల పట్టివేత... ఏడుగురికి జైలు...


నటి సోనాక్షికి షాక్... మోసంచేసిన నైజీరియన్...

హుజూర్‌నగర్‌లో 100 మంది నామినేషన్ ? సీపీఎస్ రద్దుకు డిమాండ్...
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...