మాజీ ముఖ్యమంత్రికి కారోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతోంది. సామాన్యులతో పాటు కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

news18-telugu
Updated: September 18, 2020, 3:47 PM IST
మాజీ ముఖ్యమంత్రికి కారోనా పాజిటివ్
కేశుభాయ్ పటేల్(Keshubhai Patel)
  • Share this:
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) కారోనా బారినపడ్డారు. రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఆయనకు కారోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు వారు వెల్లడించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు. అయితే గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్‌ కలిగి ఉన్నాడని.. ఇది తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని.. వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.

ఇక, భారత్‌లో కారోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 96,424 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,174 మంది మరణించారు. నిన్న 87,472 మంది కారోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,14,677కి చేరింది.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading