కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఉగ్రవాదులు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. కాంగ్రెస్ హయంలో అనేక చోట్ల దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి.. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల (Gujarat Assembly Elections) ప్రచారంలో భాగంగా... ఆదివారం ఖేడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమాద్మీపైనా విరుచుకుపడ్డారు.
'' గుజరాత్ చాలా కాలంగా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉంది. సూరత్, అహ్మదాబాద్‌లలో దాడులు జరిగాయి. బాంబు పేలుళ్లలో ఎంతో మంది గుజరాత్ ప్రజలు మరణించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు.. వారికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. టెర్రరిస్టులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారు.'' అని ప్రధాని మోదీ అన్నారు
Mann Ki Baat : మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. వాళ్లకు ప్రధాని మోదీ ప్రశంసలు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2014లో మీరు వేసిన ఒక్క ఓటు.. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పెద్ద పాత్రను పోషించిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు మన సరిహద్దుల్లో దాడులు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని తెలిపారు.
అటు ఆమాద్మీ పార్టీని కూడా ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. కొన్ని పార్టీలు షార్ట్ కట్స్‌ని నమ్ముకుంటున్నాయని... బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తున్నాయని పరోక్షంగా ఆమాద్మీ పార్టీపై సెటైర్లు వేశారు. అందువల్లే ఉగ్రవాదం విషయంలో మౌనంగా ఉంటున్నాయని అన్నారు. కొందరు సానుభూతి దొడ్డి దారిలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారని.. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని మోదీ.
కాగా, గుజరాత్లో డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తారు. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడవుతాయి. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను 99 స్థానాలను బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గత 27 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని.. ఈసారి ఎన్నికల్లో 140 సీట్లున సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Gujarat Assembly Elections 2022, Narendra modi, PM Narendra Modi