హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: నా రికార్డ్‌ను భూపేంద్ర బద్దలు కొట్టేలా కష్టపడతానని గుజరాత్‌కు మాటిచ్చా: ప్రధాని మోదీ

PM Modi: నా రికార్డ్‌ను భూపేంద్ర బద్దలు కొట్టేలా కష్టపడతానని గుజరాత్‌కు మాటిచ్చా: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Gujarat Assembly Elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మరోసారి తమకు తిరుగులేదని నిరూపించింది. వరుసగా ఏడోసారి రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకుంది. కాషాయ పార్టీ 182 సీట్లలో 156 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

PM Narendra Modi: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Election Results) బీజేపీ మరోసారి తమకు తిరుగులేదని నిరూపించింది. వరుసగా ఏడోసారి రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకుంది. కాషాయ పార్టీ 182 సీట్లలో 156 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నీతానై ఎన్నికల ప్రచారం నిర్వహించి, భాజపాకు అఖండ విజయం సాధించి పెట్టారు. మోదీ మొత్తం 31 ర్యాలీలలో ప్రసంగించారు. పోలింగ్‌కు ముందు వివిధ ప్రాంతాలలో పర్యటించి, మూడు రోడ్ షోలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 53 శాతం ఓట్లు లభించాయి. పార్టీ చరిత్రలో ఈ స్థాయి ఓట్లు పొందడం ఇదే మొదటిసారి. ఆప్ గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేయడంతో విపక్షాల ఓట్లు చీలిపోయాయి. ఈ అంశం కూడా కాషాయ పార్టీకి కలిసొచ్చింది. 1985లో మాధవసింగ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన 149 సీట్ల రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది.

GJ HP Election Results: గుజరాత్ , హిమాచల్ ఎన్నికల తుది ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే

 మోదీ మాట గుజరాత్‌ ప్రజలు విన్నారు

ఎన్నికల ఫలితాల సందర్భంగా గురువారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. తన రికార్డును బద్దలు కొట్టాలని ప్రజలను కోరానని, తన మాట విన్న ప్రజలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో బీజేపీకి అతిపెద్ద విజయాన్ని అందించారని చెప్పారు. కష్టపడి పనిచేస్తానని, నరేంద్ర రికార్డ్‌ను భూపేంద్ర పటేల్ బద్దలు కొట్టేలా కష్టపడతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. 2002లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ 127 సీట్లను సాధించింది. ఇప్పుడు ఏకంగా 156 సీట్లకు తమ బలాన్ని పెంచుకుంది.

వంశపారంపర్య పాలనపై వ్యతిరేకత

పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించిన మోదీ.. విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని ఆశీర్వదించిన ప్రజలకు నమస్కరిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం కోసం బీజేపీ పెద్ద, కఠినమైన నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు. గుజరాత్ అభివృద్ధి కోసం మా స్ఫూర్తికి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. ఏ స్థానంలోనూ రీపోలింగ్ అవసరం లేదని, సజావుగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన భారత ఎన్నికల కమిషన్‌ను అభినందించారు. 25 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీపై ప్రేమను కురిపించి గుజరాత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని అన్నారు. వంశపారంపర్య పాలనపై, అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని బీజేపీకి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందజేస్తున్న బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.

గుజరాత్ లో వార్ వన్ సైడ్..పని చేసిన మోదీ మేనియా..కలిసొచ్చిన అంశాలేంటో తెలుసా

హిమాచల్‌ ప్రదేశ్‌ సమస్యలపై పోరాడుతాం

ఈ ఎన్నికల ఫలితాలపై తాను చాలా ఎమోషనల్‌గా ఫీల్‌ అయినట్లు మోదీ చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడం గురించి స్పందించారు. హిల్‌ స్టేట్‌ ఓటర్లు బీజేపీపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజల సమస్యలపై బీజేపీ పోరాడుతుందని అన్నారు.

హిమాచల్‌లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ కంటే బీజేపీకి కేవలం 1 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయని మోదీ చెప్పారు. రాష్ట్రానికి పూర్తి అభివృద్ధిని అందిస్తూనే ఉంటాం అని హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నానని, ‘అమృత్‌కాల్‌’ జరుపుకుంటున్న తరుణంలో ఈ ఎన్నికలు వచ్చాయని అన్నారు.

అలాంటి పనులు ఎప్పటికీ చేయం

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికల్లో బీజేపీ 15 ఏళ్ల తర్వాత ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో విన్నానని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ అలాంటి పనులు ఎప్పటికీ చేయదని చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న అభిమానం దేశంలోని వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కూడా కనిపిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్, బీహార్‌లోని కుర్హానీలో జంట విజయాల ద్వారా బీజేపీపై ప్రజలకు ఉన్న ప్రేమ కనిపిస్తోందని అన్నారు.

First published:

Tags: Bjp, Gujarat, Gujarat Assembly Elections 2022, Narendra modi

ఉత్తమ కథలు