హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat Congress Manifesto: గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..10 లక్షల ఉద్యోగాలతో సహా 8 హామీలు ఇవే..

Gujarat Congress Manifesto: గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..10 లక్షల ఉద్యోగాలతో సహా 8 హామీలు ఇవే..

గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

ఇటీవల గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ బీజేపీ కంచుకోట. అలాంటి రాష్ట్రంలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ తహతహలాడుతుంది. ఈ క్రమంలో గుజరాత్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా గుజరాత్ ప్రజలు విద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేయడాన్ని అంగీకరించరు. మనమంతా కలిసి మార్పు తీసుకొద్దాం కాంగ్రెస్ కు ఓటేయండి అని ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

ఇటీవల గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ బీజేపీ కంచుకోట. అలాంటి రాష్ట్రంలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ తహతహలాడుతుంది. ఈ క్రమంలో గుజరాత్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా గుజరాత్ ప్రజలు విద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేయడాన్ని అంగీకరించరు. మనమంతా కలిసి మార్పు తీసుకొద్దాం కాంగ్రెస్ కు ఓటేయండి అని ట్వీట్ చేశారు.

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసు..జైలు నుంచి ఆరుగురు నిందితుల విడుదల..30 ఏళ్ల శిక్ష తర్వాత బయటకు..

మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.  14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.  డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది.

రెండో దశ ఎన్నికలకు నవంబరు 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబరు 17 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చారు. నవంబరు 18న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రాకు నవంబరు 21 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 5న రెండో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.  4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు  ఎన్నికల సంఘం ప్రకటించింది.

First published:

Tags: Congress, Gujarat Assembly Elections 2022

ఉత్తమ కథలు