Video: ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టుండి పడిపోయిన ముఖ్యమంత్రి..

వడోదరలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ స్టేజీ మీద పడిపోయిన గుజరాత్ సీఎం విజయ్ రుపానీ

విజయ్ రూపానీకి లో బీపీ రావడం వల్ల కళ్లుతిరిగి పడిపోయారని బీజేపీ నేతలు చెప్పారు. స్టేజీ మీద పడిపోయిన వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేశారు.

  • Share this:
    గుజరాత్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ఉన్నట్టుండి పడిపోయారు. ఎన్నికల స్టేజీ మీద మాట్లాడుతుండగానే ఆయన పడిపోయారు. పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆయన పడిపోతున్నట్టు గమనించిన వారు ఆయన్ను పట్టుకునేందుకు వచ్చారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. సీఎం స్టేజీ మీద పడిపోవడంతో అక్కడ అందరూ షాక్‌కి గురయ్యారు. స్టేజీ మీద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు ఉన్నారు. గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బీజేపీకి పెద్ద దెబ్బ తగలడంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం విజయ్ రుపానీ సహా నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ రుపానీ మాట్లాడుతుండగా, ఆయన స్టేజీమీద పడిపోయారు.

    విజయ్ రూపానీకి లో బీపీ రావడం వల్ల కళ్లుతిరిగి పడిపోయారని బీజేపీ నేతలు చెప్పారు. స్టేజీ మీద పడిపోయిన వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేశారు. కొంచె రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. విజయ్ రుపానీకి నిన్నటి నుంచి ఆరోగ్యం బాగోలేదని సీఆర్ పాటిల్ చెప్పారు. ముఖ్యమంత్రికి మెరుగైన చికిత్స అందించిన తర్వాత ఆయన కులాసాగా నడుచుకుంటూ వచ్చి కారులో వెళ్లారని తెలిపారు.



    గుజరాత్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి విజయ్ రుపానీ రంగంలోకి దిగారు. వడోదర, నిజాంపురా, కరేలీబాగ్, తార్సాలీ ప్రాంతాల్లో ఆయన ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. లవ్ జీహాద్ బిల్లును గుజరాత్‌లో ప్రవేశపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. వడోదరలో ఎన్నికల ప్రచార సభలో స్టేజీ మీద మాట్లాడుతున్న సమయంలోనే ఆయన పడిపోయారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: