హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat Bridge Collapse: గుజరాత్ వంతెన ప్రమాదం..141కి చేరిన మృతుల సంఖ్య..బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం

Gujarat Bridge Collapse: గుజరాత్ వంతెన ప్రమాదం..141కి చేరిన మృతుల సంఖ్య..బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం

PC: Twitter

PC: Twitter

గుజరాత్ (Gujarat)లో మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat | Hyderabad

గుజరాత్ (Gujarat)లో మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.  ఈ వంతెన ప్రమాదం బీజేపీ ఎంపీ మోహాన్ భాయ్ కళ్యాణ్ జి కుందరియా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  ఈ ప్రమాదంలో 12 మంది బీజేపీ ఎంపీ బంధువులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.  అలాగే అనేక మందిని అధికారులు రక్షించగా..వారిలో కొంతమందికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఇంకా సహాయక చర్యలు జరుగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Bridge Collapses: మోర్బీ ఘటనలో 141 మంది మృతి..ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాలు ఇవే..

#MorbiTragedy | Deeply saddened by loss of many lives due to collapse of cable bridge in Morbi, Guj. Our thoughts & deepest condolences to family & friends of the deceased & injured. Our hearts are with people of Guj: Simon Wong, Singapore High Commissioner to India

(File pic) pic.twitter.com/e4xU1A5PdF

— ANI (@ANI) October 31, 2022

ఈ ప్రమాదంపై  బీజేపీ ఎంపీ మోహాన్ భాయ్ కళ్యాణ్ జి కుందరియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం. ఇప్పటికే వందల మృతదేహాలు బయటకు తీశాం. ఇందులో మా బంధువులు వున్నారు. నా బావ నలుగురు కుమార్తెలు, ముగ్గురు కోడళ్ళు, 5గురు పిల్లలు ఉన్నారని అన్నారు. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కలిసిన బృందం దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టం. ఈ ప్రమాదంలో 100% నిజం బయటకు వస్తుందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు, ప్రధానమంత్రి జాతీయ సహాయం నిధి నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ప్రధాని మోడీ ప్రకటించారు.

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సస్పెన్షన్ వంతెన ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కుప్పకూలింది. ఛత్ పూజ కోసం కొన్ని ఆచారాలు నిర్వహించడానికి సుమారు 500 మంది దానిపై గుమిగూడి ఉన్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కేబుల్ వంతెనపై నిల్చున్న అనేకమంది సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది మరణించినట్లు తెలుస్తుంది.  నదిలో కుప్పకూలిన వంతెన సుమారు 140 సంవత్సరాల క్రితం బ్రిటీష్‌ కాలంలో నిర్మించినదిగా తెలుస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు ఇటీవలే పూర్తి చేశారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో వందల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

First published:

Tags: Gujarat, India

ఉత్తమ కథలు