హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat: డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్.. గుజరాత్ బీజేపీ నేత హార్దిక్ పటేల్ కొత్త నినాదం

Gujarat: డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్.. గుజరాత్ బీజేపీ నేత హార్దిక్ పటేల్ కొత్త నినాదం

హార్దిక్ పటేల్ (ఫైల్ ఫోటో)

హార్దిక్ పటేల్ (ఫైల్ ఫోటో)

Gujarat: ప్రధాని మోదీ గుజరాత్ సీఎం నుంచి పీఎం కాగానే ఓ కలతో, ప్రణాళికతో రాజకీయాలు చేసి, ప్రధాని అయ్యాక కూడా అదే కలతో ముందుకు సాగారని హార్ధిక్ అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీజేపీ నేతలు ప్రతి రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండాలని.. డబుల్ ఇంజన్ సర్కార్లతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేతలు పదే పదే కామెంట్ చేస్తున్నారు. అయితే గుజరాత్ బీజేపీ నేత హార్దిక్ పటేల్(Hardik Patel) ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. ట్రిపుల్ ఇంజన్(Triple Engine) ప్రభుత్వం గురించి హార్దిక్ ప్రస్తావించారు. కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కాదు.. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభుత్వం అంటే కిందిస్థాయి నేతలను కూడా కలుపుకోవాలని అన్నారు. అభివృద్ధి కోసం ఓటర్లు బీజేపీపై నమ్మకం ఉంచాలని అన్నారు. న్యూస్ 18తో ప్రత్యేక సంభాషణలో హార్దిక్ పటేల్ మాట్లాడారు. ఈ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పటీదార్ కమ్యూనిటీ బిజెపితో ఉందని అన్నారు. 2017లో ఓట్లు చీలిపోయాయని.. కానీ ఈసారి అందరూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi) వెంటే ఉన్నారని అన్నారు.

గుజరాత్‌లో భూముల కోసం వెతుకుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. ఆప్‌కి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మద్దతు లభించదని అంటున్నారు. గుజరాత్‌లో మూడో పార్టీ ప్రభావం లేదని... ఇది ఎన్నికల సమయమని... ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పక్షానికీ ఉందని అన్నారు. వారి మాటలు వినే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ ఈ ప్రజాధనం ఓట్లుగా మారే అవకాశం లేదని చెప్పారు. గుజరాత్‌లో ఎన్నికలు అంటే పటేల్ సామాజికవర్గం ఓట్లు మాత్రమే కాదని.. ప్రతి కులం బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఈ నమ్మకం అభివృద్ధి, దూరదృష్టి. బిజెపికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి దేశం కోసం ఒక కల ఉందని... దేశం గురించి ఎలాంటి కలలు, ప్రణాళికలు లేని ఆ పార్టీతో జనం ఎందుకు వెళ్తారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎం నుంచి పీఎం కాగానే ఓ కలతో, ప్రణాళికతో రాజకీయాలు చేసి, ప్రధాని అయ్యాక కూడా అదే కలతో ముందుకు సాగారని హార్ధిక్ అన్నారు.

PM Narendra modi: మనది బానిసల చరిత్ర కాదు.. వీరుల చరిత్ర.. లచిత్ 400వ జయంతి వేడుకలో ప్రధాని మోదీ

Kishan Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బీజేపీ అదే కోరుకుంటోందంటూ..

ప్రజలు వారిని ఇష్టపడటానికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరని.. అప్పుడు తప్పు చేశానని గ్రహించానని హార్ధిక్ చెప్పారు. గుజరాత్ గౌరవానికి, గుర్తింపునకు కాంగ్రెస్ వ్యతిరేకమని అన్నారు. గుజరాత్ గుర్తింపు కోసం పోరాడేందుకు ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్నానని చెప్పారు.

First published:

Tags: Gujarat, Hardik Patel

ఉత్తమ కథలు