గుజరాత్ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. జడేజా భార్య రివాబా (Rivabha Jadeja) బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడం.. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఆయన సోదరి నైనా ప్రచారం చేస్తుండడంతో.. జామ్‌నగర్ నార్త్ (Jamnagar Noarth) నియోజకవర్గంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. వదినా మరదళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా జడేజా భార్య రివాబాపై ఆయన సోదరి నైనా.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకుంటోందని మండిపడ్డారు. చిన్న పిల్లలతో కూడా ప్రచారం చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందేందుకు రివాబా ప్రయత్నిస్తున్నారని నైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా ఆమె వ్యవహార శైలి ఉందని మరదలిపై ధ్వజమెత్తారు నైనా.
అంతేకాదు రివాబాకు వెస్ట్ రాజ్‌కోట్‌లో ఓటు హక్కు ఉందని.. అలాంటప్పుడు జామ్‌నగర్ నార్త్ నుంచి ఎలా పోటీ చేస్తానని ప్రశ్నించారు నైనా. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి బిపింద్రసిన్హ్ జడేజాని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానికేతురులకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. రివాబా జడేజా పెళ్లయ్యాక కూడా ఇంటిపేరు మార్చుకోలేదని నైనా విమర్శలు గుప్పించారు.
Tamilnadu: తండ్రి సమాధి కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి మలేషియా ప్రయాణం..తమిళనాడు వ్యక్తి ఇంట్రెస్టింగ్ జర్నీ
రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. రవీంద్ర జడేజా భార్య 1990లో జన్మించారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. కాంగ్రెస్‌కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. ఆమెను రివా సోలంకి అని కూడా పిలుస్తారు. రివాబా మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను 2016లో రివాబా పెళ్లి చేసుకున్నారు. రివాబా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రివాబా జడేజా ఆస్తుల విలువ రూ.97 కోట్లు.
ఇక జడేజా సోదరి నైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. జామ్ నగర్ జిల్లాలో ఆమెకు మంచి పేరే ఉంది. అంతేకాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ఆమె ప్రచారం చేస్తున్నారు. జామ్ నగర్ నార్త్ టికెట్ నైనాకే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. కాంగ్రెస్ హైమాండ్ మాత్రం బిపింద్ర సిన్హ్ జడేజా వైపే మొగ్గు చూపారు. ఆయన గెలుపు కోసం నైనా తీవ్రంగా కృషి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, Ravindra Jadeja