• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • GUJARAT ASSEMBLY CONGRESS MLA VIMAL CHUDASAMA EVICTED FOR WEARING T SHIRT SU

Vimal Chudasama: టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ప్లే గ్రౌండ్ కాదన్న స్పీకర్.. కీలక ఆదేశాలు..

Vimal Chudasama: టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ప్లే గ్రౌండ్ కాదన్న స్పీకర్.. కీలక ఆదేశాలు..

ఎమ్మెల్యే విమల్(Credit: News18 Gujarat)

టీషర్ట్ ధరించి అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేకు స్పీకర్ షాక్ ఇచ్చారు.

  • Share this:
    టీషర్ట్ ధరించి అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేకు స్పీకర్ షాక్ ఇచ్చారు. టీషర్ట్‌ ధరించి సభకు హాజరుకావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. ఆ ఎమ్మెల్యే సభలో నుంచి బయటకు పంపాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటన గుజరాత్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసామా (Vimal Chudasama) టీషర్ట్ ధరించి సభకు హాజరుకావడంపై శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్ట్ లేదా కుర్తా ధరించి సభ్యులు సభకు హాజరు కావాలని సూచించారు. సభతో, వారి హుందాతనాన్ని సభ్యులు కాపాడుకోవాలని కోరారు. వారం రోజుల క్రితం ఇదే రకమైన సూచన చేసిన పట్టించుకోకపోతే ఎలా అని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విమల్‌ ఉద్దేశించి అన్నారు.

    అయితే స్పీకర్ ఆదేశాలపై విమల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. టీషర్ట్ ధరించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. తాను టీషర్ట్ ధరించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనానని, ప్రజలను ఓట్లు అడిగానని అన్నారు. టీషర్ట్ ధరించి ఓట్లు అడిగిన నన్ను.. ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం ద్వారా తన ఓటర్లను అగౌరవ పరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

    ఆ తర్వాత స్పీకర్ స్పందిస్తూ.. "మీరు మీ ఓటర్లను ఎలా ఓట్లు అడిగారో నాకు తెలియదు. మీరు స్పీకర్ ఆదేశాల్ని అగౌరవపరుస్తున్నారు. మీరు ఎమ్మెల్యే అయినందున సభకు సరైన దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు. ఇది ప్లే గ్రౌండ్ కాదు. ఇక్కడ కొన్ని ప్రొటోకాల్స్ అనుసరించాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు. ఇక, విమల్ సభలో నుంచి వెళ్లకపోవడంతో గార్డులు ఆయనను బయటకు తీసుకెళ్లారు.

    ఈ క్రమంలోనే విమల్‌ను మూడు రోజుల పాటు సభ నుంచి బహిష్కరించే ప్రతిపాదన ను బీజేపీ మంత్రి ఒకరు సభ ముందు ఉంచారు. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. సభకు హాజరయ్యే సమయంలో ధరించే దుస్తుల విషయంలో నియమాలు పాటించేలా విమల్‌ను ఒప్పించాలని కాంగ్రెస్ సభ్యులను ముఖ్యమంత్రి కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు