• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • GUJARAT 3 DEAD 1 INJURED AS BUILDING COLLAPSES IN VADODARAS BAWAMANPURA RESCUE OPERATION UNDERWAY NK

Vadodara Building Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన భవనం... ముగ్గురు మృతి

గుజరాత్‌లో కుప్పకూలిన భవనం... ముగ్గురు మృతి (credit - twitter - ANI)

Vadodara Building Collapse: వర్షాకాలం కదా... పాత భవనాలు ఒక్కసారిగా కుప్ప కూలుతున్నాయి. గుజరాత్‌లో జరిగిన విషాదం... ముగ్గురి ప్రాణాలు తీసింది.

  • Share this:
    Vadodara Building Collapse: గుజరాత్... వడోదరలోని... బవమాన్‌పురాలో... ఓ నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రాత్రివేళ ఇలా జరగడంతో... ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో... ఇద్దరు పురుషులు, ఓ మహిళ స్పాట్ లోనే చనిపోయారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అతని వయస్సు 18 ఏళ్లు అని అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈమధ్య మహారాష్ట్రతోపాటూ... గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో... ఆ భవనం... వర్షానికి బాగా నానిపోయి... కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.



    ప్రస్తుతం చుట్టుపక్కల పాత భవనాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈమధ్యే... ముంబైలో... మూడు అంతస్థుల భవనం సగం వరకూ కూలిపోయింది. 10 మంది ప్రాణాలు పోయాయి. అందువల్ల ఇలాంటి భవనాలు ఇంకా ఎకకడెక్కడ ఉన్నాయనే అంశంపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. 20 ఏళ్లకు మించిన భవనాలు, బీటలు వారిన భవనాల్లో ఉండేవారు... అవి పటిష్టంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: