రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆమ్ ఆద్మీపార్టీ గుజరాత్ లో ప్రచారం స్పీడ్ ను పెంచింది. ఇప్పటికే ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, (Arvind Kejriwal) పంజాబ్ సీఎం పలుమార్లు గుజరాత్ లో పర్యటించారు. అక్కడ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అంతే కాకుండా ఢిల్లీ మోడల్ డెవలప్ మెంట్ చేసి చూపిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండురోజుల ప్రచారంలో భాగంగా గుజరాత్ లో ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో కేజ్రీవాల్ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ప్రచార ర్యాలీలో ‘జై శ్రీరాం’ (Jai Shri Ram) అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా.. బీజేపీ పార్టీ గుజరాత్ లో ఎలాంటి డెవలప్ మెంట్ చేయలేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ లేనిపోని అసత్యాలు మాట్లాడుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ నోట.. జైశ్రీరాం నినాదాల పట్ల బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నికలలో భాగంగా స్టంట్ అంటూ అపోసిషన్ వారు విమర్శిస్తున్నారు.
కేజ్రీవాల్ ఎన్ని స్టంట్ లు చేసిన, ప్రజలు బీజేపీకే పట్టంకడతారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కాగా , ఢిల్లీలో జరిగిన బౌద్ధమత కార్యక్రమంలో ఆప్ కన్వీనర్ ప్రమాణం చేసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరగటం వార్తలలో నిలిచింది. అంతకు ముందు.. కేజ్రీవాల్ ర్యాలీలో ఆప్ కార్యకర్తలు ఆప్ వ్యతిరేక పోస్టర్లను తొలగించారు. ర్యాలీ వేదిక వద్దకు పార్టీ అధినేత వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఆప్ వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లను కార్యకర్తలు కిందకు దించారు. Mr కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రస్తుతం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ను (Congress) అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bhrat jodo yatra) చేపట్టారు.
ఈయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు కొనసాగుతుంది. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి భారీఎత్తున రెస్పాన్స్ కూడా వస్తుంది. ప్రజలు కాంగ్రెస్ కు సంఘీభావంగా రాహుల్ తో కలిపి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా అక్టోబరు 17 న రాహుల్ పాదయాత్రక బ్రేక్ పడనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అదే రోజున కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఎన్నికల నేపథ్యంలోనే 17న విరామం ఉండబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అత్యున్నత (Congress Presidential elections) పదవి రేసులో శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 15 రోజుల సుదీర్ఘ యాత్ర కొనసాగుతుంది. పోలింగ్ కోసం, మార్చ్‌లో పాల్గొనే దాదాపు 40 మంది ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ’ ప్రతినిధులు, క్యాంపు స్థలంలోనే పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తారు. అర్హులైన వారందరూ ఓట్లు వేస్తారు. రాహుల్ గాంధీ కూడా ఓటు వేయనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఐడీ కార్డు మాత్రమే అవసరమని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Bjp, Elections, Gujarat