Home /News /national /

Black fungus : బ్లాక్ ఫంగస్‌ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఐసిఎమ్‌ఆర్

Black fungus : బ్లాక్ ఫంగస్‌ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఐసిఎమ్‌ఆర్

Black Fungus పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

Black Fungus పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

Black fungus : కరోనా తర్వాత గత కొద్దిరోజుల నుండి భయపెడుతున్న బ్లాక్ ఫంగస్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కొంతమందికి ఈ ఫంగస్ సోకి కళ్లుపోయిన పరిస్థితి కనిపించడంతో ఈ ఫంగస్‌ నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐసీఎమ్‌ఆర్ కలిసి గైడ్‌లైన్స్ విడుదల చేశాయి.

ఇంకా చదవండి ...
కరోనా తర్వాత గత కొద్దిరోజుల నుండి భయపెడుతున్న బ్లాక్ ఫంగస్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కొంతమందికి ఈ ఫంగస్ సోకి కళ్లుపోయిన పరిస్థితి కనిపించడంతో ఈ ఫంగస్‌ నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐసీఎమ్‌ఆర్ కలిసి గైడ్‌లైన్స్ విడుదల చేశాయి. దీని భారిన పడకుండా పలు జాగ్రత్తలను చెప్పింది.

కోవిడ్ భారి నుండి కొలుకున్న తర్వాత కొంతమంది బ్లాక్ ఫంగస్‌ భారిన పడుతున్నారు. ముందుగా ఈ బ్లాక్ ఫంగస్‌ను అహ్మదాబాద్, మరియు ఢిల్లీ రాష్ట్రాల్లో బయటపడిన విషయం తెలిసిందే..దీని ద్వార పెద్ద ముప్పు ఉందని గ్రహించిన కేంద్రం ప్రజలను అలర్ట్ చేసింది. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారు ఎక్కువవుతుండడంతో ఐసీఎమ్ఆర్‌తో కొన్ని మార్గదర్శకాలను రూపోందించింది.ఇందులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపింది.

బ్లాక్‌ ఫంగస్‌‌కు మ్యూకోర్ అనే ఫంగస్ కారణం

బ్లాక్‌ ఫంగస్‌, ‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదని తెలిపింది. గతంలో కూడా ఈ ఫంగస్ ఉంది. కానీ, తాజాగా కోవిడ్‌ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు వివరించింది. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ముఖ్యంగా ఈ వైరస్ వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్‌’ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుందని తెలిపింది. అయితే చాలా అరుదుగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంటుందని చెప్పింది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉన్నట్టు వివరించింది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరడంతో ప్రాణాపాయం మీదకు వస్తుందని చెప్పారు.

బ్లాక్‌ ఫంగస్‌ లక్షనాలు కూడ కోవిడ్‌నే పోలి ఉంటాయి

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్‌ లెవల్స్‌ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి.

చికిత్స ఏమిటి

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలని సూచించింది. వైద్యులు సూచించిన విధంగా స్టెరాయిడ్స్‌ను వాడాలని మార్గదర్శకాల్లో పేర్కోంది.డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్‌, యాంటీఫంగల్‌ ఔషధాలను తీసుకోవచ్చని సూచించారు.

మాస్క్ తోపాటు గ్లౌవ్స్, సాక్స్ తప్పని సరి

సాధరణంగా ఈ ఫంగస్ దరి చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడంతో పాటు వీలైనంతగా శరీరానికి తాకకుండా పూర్తి దుస్తులు వేసుకోవాలని చెప్పింది. ఇక చేతులకు గ్లౌవ్స్‌ , కాళ్లకు సాక్సులు వేసుకోవాని సూచించింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Black Fungus, ICMR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు