విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం కొత్త రూల్స్...

అయితే, డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది.

భారత్‌లో అంతర్జాతీయ ఫ్లైట్స్ జూన్ మధ్య లేదా ఆగస్ట్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు పౌర విమానయాన శాఖ వర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    రేపటి నుంచి (మే 25) డొమెస్టిక్ ఫ్లైట్స్ సేవలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు భారత్‌లో అంతర్జాతీయ ఫ్లైట్స్ జూన్ మధ్య లేదా ఆగస్ట్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు పౌర విమానయాన శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ పాసింజర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    1. విమానం ఎక్కేముందే ప్రయాణికులు తాము 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటామని హామీ ఇవ్వాలి. అందులో వారం రోజులు పెయిడ్ క్వారంటైన్, ఆ తర్వాత మరో వారం రోజులు హోమ్ క్వారంటైన్.
    2. కొన్ని అనివార్య పరిస్థితుల్లో అంటే మానసిక ఒత్తిడి, గర్భం, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, తీవ్ర అనారోగ్యం, తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తున్న 10 సంవత్సరాలలోపు పిల్లలు, ఆయా రాష్ట్రాలు పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వినియోగించాలి.
    3. ఏం చేయాలి?, ఏం చేయకూడదు? అనే అంశాలను టికెట్‌కు అనుబంధంగా ప్రయాణికులకు అందజేస్తారు.
    4. ప్రయాణికులు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను తమ మొబైల్‌లో వినియోగించాలి.
    5. ప్రయాణికులు విమానం లేదా షిప్ ఎక్కే ముందు థర్మల్ స్క్రీన్ నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
    6. రోడ్డుమార్గం ద్వారా ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
    7. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం నింపి దాని డూప్లికేట్ కాపీని విమానాశ్రయం, సీపోర్ట్, లాండ్ పోర్ట్‌ల్లో హెల్త్ , ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి. ఈ ఫాం ఆరోగ్య సేతులో కూడా అందుబాటులో ఉంది.
    8. విమానాలు, విమానాశ్రయాల్లో పర్యావరణ పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేయాలి.
    9. విమానం ఎక్కేటప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
    10. కోవిడ్ 19కు సంబంధించిన అన్ని రకాలైన హెచ్చరికలను విమానాశ్రయలు, సీ పోర్టుల్లో ఏర్పాటు చేయాలి.
    11. విమానం లేదా షిప్‌లో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలి. చేతులు శుభ్రం పరుచుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి.
    12. ప్రయాణికులు దిగిన తర్వాత కూడా తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి.
    13. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
    14. మిగిలిన ప్రయాణికులను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించాలి.
    15. అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. వారిని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్‌ను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: