చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్ (GST Council) సమావేశం బుధవారం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పన్ను (Tax) చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గూడ్స్, సర్వీస్ టాక్స్(GST) కౌన్సిల్ ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి GSTR-4 ఫారమ్‌ను దాఖలు చేయడంలో ఆలస్యమైతే విధించే రుసుమును మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఫారమ్ GST CMP-08ని దాఖలు చేయడానికి గడువును పొడిగించింది.
జీఎస్‌టీ కౌన్సిల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. ‘జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశం 2022 జూన్ 28, 29 తేదీల్లో చండీగఢ్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. వస్తువులు, సేవల సరఫరాపై జీఎస్‌టీ రేట్లలో మార్పులు, జీఎస్‌టీ యాక్ట్, విధానానికి సంబంధించిన మార్పులకు సంబంధించి కౌన్సిల్ కొన్ని సిఫార్సులను చేసింది’ అని తెలిపింది.
జీఎస్‌టీ కౌన్సిల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారమ్ GSTR-4ని దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు సెక్షన్ 47 కింద ఆలస్య రుసుము మినహాయింపును దాదాపు నాలుగు వారాల పాటు, జూలై 28 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న మినహాయింపు మే 1 నుంచి జూన్ 30 వరకు ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫారమ్ GST CMP-08 దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 18 నుంచి జూలై 31 వరకు పొడిగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
అంతర రాష్ట్ర సరఫరాల సరైన సమాచారం, ఇనెలిజిబుల్/బ్లాక్‌డ్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మొత్తాన్ని తప్పనిసరిగా అందించడం, GSTR-3B(నెలవారీ పన్ను చెల్లింపు ఫారమ్)లో స్పష్టం చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ ఒక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. వివిధ సమస్యలపై అస్పష్టత, చట్టపరమైన వివాదాలను తొలగించడానికి, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
జీఎస్‌టీలో సమ్మతిని క్రమబద్ధీకరించడానికి, వాటాదారుల ఇన్‌పుట్‌లు/సూచనలను కోరడం కోసం ఫారమ్ GSTR-3Bలో సమగ్ర మార్పులను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ఒక ప్రతిపాదన చేసింది.
ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికానికి ఫారమ్ GST CMP-08 దాఖలు చేయడానికి గడువు తేదీని 2022 జూలై 18 నుంచి జూలై 31 వరకు పొడిగించాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. కొందరు కంపోజిషన్ పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌లో నెగిటివ్ బ్యాలెన్స్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని GSTNని కోరినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించిన ఫారమ్ GSTR-9/9Aలో వార్షిక రిటర్న్‌ను దాఖలు చేయడం నుంచి AATO రూ.2 కోట్ల వరకు మినహాయింపు ఉంటుందని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్క్యులర్‌ను విడుదల చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GST, GST Council, Nirmala sitharaman, Taxes