జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: 33 వస్తువులపై పన్ను తగ్గింపు

దేశంలోని 99శాతం వస్తువులను 18శాతం లేదా అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి తీసుకొస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వస్తు పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

news18-telugu
Updated: December 22, 2018, 3:58 PM IST
జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: 33 వస్తువులపై పన్ను తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జీఎస్టీ పరిధిలోని ఆయా శ్లాబుల్లో ఉన్న వస్తువుల పన్ను రేట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశంలో ఆయా వస్తువుల పన్ను రేటును సవరించారు. ఇందులో భాగంగా మొత్తం 33 వస్తువుల పన్ను రేట్లను తగ్గించారు. 7 వస్తువులను 28శాతం పన్ను శ్లాబు నుంచి 18శాతం శ్లాబులోకి చేర్చారు. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు.

దేశంలోని 99శాతం వస్తువులను 18శాతం లేదా అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి తీసుకొస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వస్తు పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు తాజా సమావేశంలో 33 వస్తువుల పన్ను రేట్లను తగ్గించగా.. మిగతా వస్తువుల పన్ను తగ్గింపుపై త్వరలోనే ఫిట్‌మెంట్ కమిటీ సమీక్ష జరిపి నిర్ణయించనుంది.ప్రస్తుతం జీఎస్టీ విధానంలో నాలుగు రకాల పన్ను శ్లాబులు 8%,12%,18%,28% అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

లగ్జరీ ఐటెమ్స్‌ను మినహాయిస్తే అన్ని రకాల వస్తువులను 18శాతం లేదా అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ డిమాండ్. 34 వస్తువులు మినహాయించి మిగతా అన్ని రకాల వస్తువులు 18శాతం శ్లాబులోకి రాబోతున్నాయి. ఇవన్నీ సామాన్యులు ఉపయోగించే వస్తువులే.
నారాయణ స్వామి, పుదుచ్చేరి సీఎం




Published by: Srinivas Mittapalli
First published: December 22, 2018, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading